20 రూపాయల నోటుకు కొత్త రూపాన్ని ఇచ్చింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. మహాత్మ గాంధీ శ్రేణిలో రూపొందించిన ఈ నోటు త్వరలో మార్కెట్లోకి రానుంది. పూర్తిగా ఆకుపచ్చ పసుపు రంగుల మిశ్రమంలో తయారు చేశారు.
20 రూపాయల నోటుకు కొత్త రూపు - ఆర్బీఐ
కొత్త 20 రూపాయల నోటును త్వరలో తీసుకురానున్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. మహాత్మ గాంధీ శ్రేణిలో ఆకు పచ్చ, పసుపు రంగుల మిశ్రమంలో ఈ కొత్త నోటు రూపుదిద్దుకోనుంది.
20rs
నోటు వెనుక భాగంలో ప్రఖ్యాత ఎల్లోరా గుహల ముఖచిత్రాన్ని ముద్రించారు.
దీనిపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుందని కేంద్ర బ్యాంక్ ప్రకటించింది. కొత్తవి మార్కెట్లోకి వచ్చిన తర్వాత కూడా పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.
Last Updated : Apr 27, 2019, 12:57 PM IST