తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తల్లిదండ్రులు టీవీలో బిజీ- తొట్టిలో పడి చిన్నారి మృతి - తమిళనాడులో విషాదం

తమిళనాడు త్రెస్పురం గ్రామంలో ఘోరం జరిగింది. తల్లిదండ్రులు టీవీ చూస్తూ పాపను గమనించకపోవడం వల్ల ఓ మూడేళ్ల చిన్నారి నీటితొట్టిలో పడి చనిపోయింది. చిన్నారి నీటితొట్టిలో పడిపోయిన సమయంలో వారు బోరుబావిలో పడిపోయిన సుజిత్ విల్సన్ వార్తలు చూస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తల్లిదండ్రులు టీవీలో బిజీ- తొట్టిలో పడి చిన్నారి మృతి

By

Published : Oct 29, 2019, 4:07 PM IST

Updated : Oct 29, 2019, 5:23 PM IST

తల్లిదండ్రులు టీవీలో బిజీ- తొట్టిలో పడి చిన్నారి మృతి

సుజిత్​ విల్సన్​....! కొద్దిరోజులుగా జాతీయస్థాయిలో వినిపిస్తున్న పేరు. బోరు బావిలో పడిపోయిన ఆ బాలుడు క్షేమంగా బయటకు రావాలని యావద్దేశం ప్రార్థించింది. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబమూ అదే పనిచేసింది. సుజిత్​ బయటకు వస్తే చూడాలన్న ఆశతో టీవీకే అతుక్కుపోయింది. అదే... ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది. వారి రెండేళ్ల పాప నీటితొట్టిలో పడి ప్రాణాలు కోల్పోయింది.

ఇదీ జరిగింది..

తమిళనాడు త్రెస్పురం గ్రామంలో మూడేళ్ల పసిపాప రేవతి సంజన నిన్న రాత్రి ఆడుకుంటూ నీటి తొట్టిలో పడి చనిపోయింది. ఆ సమయంలో పాప తల్లిదండ్రులు బోరుబావిలో పడిపోయిన సుజిత్ విల్సన్​ గురించి టీవీలో వస్తున్న వార్తలు చూస్తున్నారు. ఫలితంగా వారు చిన్నారిని గమనించలేదు. దీనితో ఘోరం జరిగిపోయింది.

తరువాత కొద్దిసేపటికి పాప గురించి వెతికిన వారికి నీటి తొట్టిలో చలనం లేకుండా ఉన్న చిన్నారి కనిపించింది. హుఠాహుఠిన ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. పాప అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:-అశ్రునయనాల మధ్య సుజిత్​కు తుది వీడ్కోలు

Last Updated : Oct 29, 2019, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details