తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్రఘాతుకం-ఇద్దరు సామాన్యులు బలి - grenade attack

జమ్ముకశ్మీర్​లో సామాన్యులు లక్ష్యంగా ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. శ్రీనగర్, అనంత్​నాగ్​ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఉగ్రదాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.

grenade
కశ్మీర్​లో ఉగ్రఘాతుకం-ఇద్దరు సామాన్యులు బలి

By

Published : Nov 26, 2019, 5:18 PM IST

ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్​లో అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. రాజధాని శ్రీనగర్​ సహా, అనంత్​నాగ్​ జిల్లాలోని వఘూరా ప్రాంతంలో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనల్లో ఇద్దరు సాధారణ పౌరులు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి.

అనంత్​నాగ్ జిల్లా వఘూరా ప్రాంతంలో సామాన్యులు లక్ష్యంగా ముష్కరులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. నలుగురికి గాయాలయ్యాయి. శ్రీనగర్​లోని కశ్మీర్​ విశ్వవిద్యాలయం సర్ సయ్యద్ గేట్ సమీపంలో ఐఈడీ బాంబు పేల్చారు ఉగ్రవాదులు. ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు.

ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి: విమానాశ్రయంలో తిరిగేందుకు త్వరలో 'ఎయిర్​ట్రైన్'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details