మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఛత్రి చౌక్ ప్రాంతంలోని గోపాల్ మందిర్లో కల్తీ మద్యం సేవించి ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది అనారోగ్యానికి గురయ్యారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
గోపాల్ మందిర్లో ఉదయం నలుగురు యువకులు రోడ్డు పక్కన పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. అందులో పిప్లోడా ప్రాంతానికి చెందిన శంకర్ లాల్, భేరుపురాకు చెందిన విజయ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.