ఆదివారం ఉదయం జమ్ముకశ్మీర్ శోపియాన్ జిల్లాలో భద్రతాబలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వీరు లష్కరే తోయిబా సంస్థకు చెందిన జావిద్ అహ్మద్ బట్, అదిల్ బషీర్ వానిలుగా అధిాకారులు ధ్రువీకరించారు. హింద్ సీతాపూర్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేశాయి బలగాలు.
కశ్మీర్లో ఇద్దరు లష్కరే తోయిబా ముష్కరులు హతం - హతం
జమ్ముకశ్మీర్ శోపియాన్లో ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా సంస్థకు చెందిన తీవ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
కశ్మీర్లో ఇద్దరు లష్కరే తోయిబా ముష్కరులు హతం
గాలింపు చేపడుతుండగా భద్రతా సిబ్బందిపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీటుగా బదులిచ్చిన సైన్యం ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను హతమార్చింది. ఘటనా స్థలం నుంచి పేలుడు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
- ఇదీ చూడండి:గంభీర్ క్షమాపణ చెప్పాల్సిందే : కేజ్రీవాల్
Last Updated : May 12, 2019, 8:29 PM IST