బలపరీక్ష నిర్వహించాలంటూ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ను... ఉపసంహరించుకుంటున్నట్లు వారి తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్ శంకర్, హెచ్ నగేష్ తరపున న్యాయవాదులు వాదించారు. కుమారస్వామి ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించేలా కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ను ఆదేశించాలంటూ దాఖలు చేసిన తమ పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు అనుమతివ్వాలని కోరారు.
వీరి వాదనలు విన్న ధర్మాసనం... ఎమ్మెల్యేల తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ ఎక్కడ? అభిషేక్ సింఘ్వి ఎక్కడ అని ప్రశ్నించింది. వారిద్దరి సమక్షంలోనే తాము ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.