తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో మళ్లీ చెలరేగిన అల్లర్లు... ఇద్దరు మృతి

పశ్చిమ్​ బంగ​లో భాజపా, తృణమూల్​ కాంగ్రెస్​ శ్రేణుల మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. 24 పరగణాల జిల్లాలో మరోమారు చెలరేగిన అల్లర్లలో ఇద్దరు మృతి చెందారు. 11 మంది గాయపడ్డారు.

By

Published : Jun 21, 2019, 6:33 AM IST

బంగాల్​లో కొనసాగుతున్న అల్లర్లు... ఇద్దరు మృతి

బంగాల్​లో కొనసాగుతున్న అల్లర్లు... ఇద్దరు మృతి

బంగాల్​లో భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా చెలరేగిన అల్లర్లలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తర 24 పరగణాల జిల్లా భట్‌పరా ప్రాంతంలో ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు తుపాకులు, నాటు బాంబులతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పానీపూరీ విక్రయించే రాంబాబు షా అక్కడికక్కడే మృతిచెందగా.. ధరమ్​వీర్​ అనే మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

అల్లర్లు జరిగిన ప్రాంతంలో 144 సెక్షన్​ విధించారు.

భట్‌పరాలో కొత్తగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవానికి బంగాల్‌ డీజీపీ వస్తుండగానే ఈ ఘర్షణ చోటుచేసుకోవటం గమనార్హం. బంగాల్‌లో చెలరేగుతున్న హింసపై త్వరలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నట్లు బారక్​పుర్ భాజపా ఎంపీ అర్జున్‌ సింగ్ తెలిపారు.

భట్‌పరాలో ఉద్రిక్తతలను చక్కదిద్దేందుకు బంగాల్ ప్రభుత్వం పెద్దఎత్తున రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలను మోహరించింది. ఈ ఘటనకు సంబంధం ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి:బస్సు ప్రమాదంలో 45కు చేరిన మృతుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details