తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదుగురు జవాన్లను బలిగొన్న ముష్కరులు - JAMMU

జమ్ముకశ్మీర్​ అనంత్​నాగ్​లో ఉగ్రవాదులు మరోసారి విధ్వంసం సృష్టించారు. గస్తీ విధులు​ నిర్వహిస్తున్న సీఆర్​పీఎఫ్​ జవాన్లే లక్ష్యంగా మెరుపుదాడి చేశారు. ఈ ఘాతుకంలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఓ ముష్కరుడ్ని మట్టుబెట్టాయి భద్రతా దళాలు.

జమ్ములో ఉగ్రఘాతుకం.. ముగ్గురు జవాన్ల మృతి

By

Published : Jun 12, 2019, 6:42 PM IST

Updated : Jun 12, 2019, 9:01 PM IST

జమ్మూలో ఉగ్రఘాతుకం

జమ్ముకశ్మీర్​లో ముష్కరుల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. వరుస దాడులతో గందరగోళం సృష్టిస్తున్న తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్ము కశ్మీర్​ అనంత్​నాగ్​లోని కేపీ రోడ్​లో గస్తీ విధులు​ నిర్వహిస్తున్న సీఆర్​పీఎఫ్​ బృందంపై మెరుపుదాడికి పాల్పడ్డారు. అత్యాధునిక రైఫిళ్లు, గ్రనేడ్లతో ఉగ్రవాదులు... జవాన్లపై విరుచుకుపడ్డారు. భద్రతా సిబ్బంది దాడిని ప్రతిఘటించారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. మరి కొందరికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో జమ్ముకు చెందిన ఎస్సైతో పాటు.. అనంత్​నాగ్​ పోలీస్​ స్టేషన్​ హౌస్​ ఆఫీసర్​ ఉన్నారు. వీరిని చికిత్స కోసం శ్రీనగర్​కు తరలించారు.

ఎన్​కౌంటర్​లో ఓ ముష్కరుడు హతమయ్యాడు.

ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి.

Last Updated : Jun 12, 2019, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details