తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెరోల్​ టు పరార్​- ముంబయి పేలుళ్ల కేసు దోషి మాయం

పెరోల్​పై వెళ్లిన ముంబయి వరుస పేలుళ్ల కేసులో దోషి జలీస్​ అన్సారీ పరారైనట్లు తెలుస్తోంది. నమాజ్​ కోసమని బయటకు వెళ్లి తిరిగి రాలేదని అతని కుమారుడు ముంబయి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. అన్సారీని వెతికేందుకు ముంబయి క్రైం బ్రాంచ్​తో పాటు మహారాష్ట్ర ఏటీఎస్​ పోలీసులు రంగంలోకి దిగారు.

MH-BLASTS-CONVICT
ముంబయి పేలుళ్ల కేసు దోషి మాయం

By

Published : Jan 17, 2020, 1:28 PM IST

1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో దోషి జలీస్​ అన్సారీ పరారయ్యాడు. పెరోల్​ మీద బయటకు వెళ్లిన అన్సారీ పారిపోయాడని తెలుస్తోంది. నమాజ్​ కోసమని బయటకు వెళ్లి తిరిగి రాలేదని అతని కుమారుడు అగ్రిపాదా ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

అన్సారీ ముంబయిలోని మొమిన్​పుర నివాసి. దేశవ్యాప్తంగా జరిగిన బాంబు పేలుళ్లలో నిందితుడిగా ఉన్న అన్సారీ.. రాజస్థాన్​లోని ఆజ్మేర్​ కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. షరతులతో కూడిన 21 రోజుల పెరోల్​పై బయటకు వచ్చాడు.

ఈ 21 రోజులు స్థానిక అగ్రిపాదా పోలీస్​ స్టేషన్​లో ఉదయం 1.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో హాజరు వేయించుకోవాల్సి ఉంది. అయితే గురువారం నిర్ణీత సమయంలో ఠాణాకు వెళ్లలేదు అన్సారీ.

మిస్సింగ్​ కేసు..

కొద్ది సేపటి తర్వాత అతని కుమారుడు జైద్​ అన్సారీ వచ్చి.. తండ్రి తప్పిపోయాడని ఫిర్యాదు చేశాడు. ఉదయం నమాజ్​ కోసమని బయటకు వెళ్లి తిరిగిరాలేదని పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుతో మిస్సింగ్​ కేసు నమోదు చేశారు పోలీసులు. ముంబయి నేర విభాగంతో పాటు మహారాష్ట్ర ఏటీఎస్​ పోలీసులు అన్సారీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

డాక్టర్​ బాంబ్​..

ముంబయి పేలుళ్ల కేసులో దోషి జలీస్​ను డాక్టర్​ బాంబ్​గా కూడా పిలుస్తారు. సిమి, ఇండియన్​ ముజాహిదీన్​తో సంబంధాలు ఉన్నాయని జలీస్​పై ఆరోపణలు ఉన్నాయి. చాలా ఉగ్రవాద సంస్థలకు బాంబుల తయారీ నేర్పించాడని పోలీసులు చెబుతున్నారు. 2008 ముంబయి పేలుళ్ల కేసుకు సంబంధించి 2011లో ఎన్​ఐఏ జలీస్​ను విచారించింది.

ఇదీ చూడండి: 'ఉరి'కి మరింత చేరువగా నిర్భయ దోషులు!

ABOUT THE AUTHOR

...view details