ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్‌లోయలో 190 రాళ్లదాడి ఘటనలు జరిగాయని వెల్లడించారు అధికారులు. ఇందుకు కారణమైన 250మంది ప్రస్తుతం జైళ్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన పలు గణాంకాలను అధికారులు విడుదల చేశారు. మొత్తంగా 2019లో 544 రాళ్లదాడులు జరిగాయని స్పష్టం చేశారు.
డిసెంబర్ 8 వరకు ఉన్న గణాంకాల ప్రకారం 356మంది వివిధ అభియోగాల కింద జైళ్లలో ఉండగా అందులో 250మంది రాళ్లదాడికి పాల్పడిన వారని విశదీకరించారు. 2018లో802 రాళ్లదాడులు చోటుచేసుకున్నాయని వెల్లడించారు.
చొరబాట్ల ద్వారా 114మంది
సరిహద్దు వెంబడి 171 చొరబాటు యత్నాలు జరిగాయని.. అందులో 114 విజయవంతమయ్యాయని స్పష్టం చేశారు. ఆగస్టులో 32 మంది, సెప్టెంబర్‌లో 20, అక్టోబర్‌లో ఏడుగురు చొరబాటుదారులు దేశంలో ప్రవేశించారని అధికారులు వెల్లడించారు.