తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యువతిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన దుండగులు! - మహారాష్ట్ర తాజా న్యూస్

మహారాష్ట్రలో మరో యువతిపై పెట్రోల్​ పోసి నిప్పంటించారు దుండగులు. వార్దా జిల్లాలో లెక్చరర్​పై మాజీ ప్రియుడి దాడి మరువకముందే.. లాతుర్​లో 18 ఏళ్ల యువతిపై పెట్రోల్​తో దాడి చేశారు.

maharastra, latur, woman set fire
మహారాష్ట్రలో మరో దారుణం

By

Published : Feb 7, 2020, 11:06 AM IST

Updated : Feb 29, 2020, 12:17 PM IST

యువతిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన దుండగులు!

మహారాష్ట్ర లాతుర్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 18 ఏళ్ల యువతిపై పెట్రోల్​ పోసి దుండగులు.. నిప్పంటించారు. యువతి ముఖం కాలిపోగా.. 15 శాతం గాయాలతో ఉన్న ఆమెను లాతుర్​ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు స్థానికులు.

యువతి ఇంటి ముందే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడికి కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

మహారాష్ట్రలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆరు రోజుల్లో రాష్ట్రంలో ఇది మూడో ఘటన. ఇటీవల వార్దా జిల్లాలో లెక్చరర్​పై మాజీ ప్రియుడు పెట్రోల్​ పోసి నిప్పంటించిన ఘటన మరువకముందే తాజా దాడి జరిగింది.

ఇదీ చూడండి: లెక్చరర్​పై పెట్రోల్​ పోసి నిప్పంటించిన మాజీ ప్రియుడు

Last Updated : Feb 29, 2020, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details