పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ 17 మంది ఎంపీలకు కరోనా నిర్ధరణ అయింది. వైరస్ సోకినవారిలో 12 మంది అధికార భాజపాకు చెందినవారు కాగా.. వైకాపా సభ్యులు ఇద్దరు, ఆర్ఎల్పీ, శివసేన, డీఎంకే నుంచి ఒకరు చొప్పున ఉన్నారు.
వైకాపా ఎంపీల్లో గొడ్డేటి మాధవి, రెడ్డప్ప.. భాజపాలో అనంత కుమార్ హెగ్డే, మీనాక్షి లేఖి, పర్వేశ్ సాహిబ్ సింగ్‌లు ఉన్నారు.