తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహా విషాదం: వర్షాలకు 30 మంది బలి - 12 dead

మహారాష్ట్రను వర్షాలు వణికిస్తున్నాయి. రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల వానల వల్ల జరిగిన దుర్ఘటనల్లో 30 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.

కళాశాల ప్రహరీ గోడ కూలి ఘోర ప్రమాదం

By

Published : Jul 2, 2019, 6:24 AM IST

Updated : Jul 2, 2019, 11:03 AM IST

మహారాష్ట్రలో వరుణుడి బీభత్సం

మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు చోట్ల భారీ వానలకు గోడలు కూలిన ఘటనల్లో మొత్తం 30 మంది మరణించారు.

ముంబయి మలాద్​ ఈస్ట్​ ప్రాంతంలోని కురార్​ గ్రామంలో గోడ కూలి... సమీపంలోని గుడారాలపై పడింది. శిథిలాల కింద చిక్కుకొని 18 మంది మరణించారు. మరో 50 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్​. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

ఠానేలో...

ఠానే జిల్లాలోని కల్యాణ్​లో గోడ కూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాంగం, జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్డీఆర్​ఎఫ్​) ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.

పుణె ఆంబెగావ్​లోని​ సింహ్​గడ్​ కళాశాల ప్రహరిగోడపై భారీ వర్షాల కారణంగా ఓ చెట్టు కూలింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మరికొంతమందికి గాయాలయ్యాయి.

మహారాష్ట్రలో వేర్వేరు చోట్ల ఇదే తరహాలో జరిగిన దుర్ఘటనల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.

Last Updated : Jul 2, 2019, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details