తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెన్నై వేదికగా దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం

చెన్నై వేదికగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రా మండలి 11వ సమావేశమైంది. ఈ భేటీకి ఐదు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రధానంగా అంతరాష్ట్రాల నదీ జలాలు, కేంద్ర పథకాలపై చర్చ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్​ నుంచి సీఎస్​ ఎల్​వీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

చెన్నై వేదికగా దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం

By

Published : Sep 27, 2019, 1:20 PM IST

Updated : Oct 2, 2019, 5:09 AM IST

చెన్నై వేదికగా దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం

దక్షిణాది రాష్ట్రాల మండలి 11వ సమావేశం చెన్నైలో జరిగింది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలు సహా ఐదు దక్షిణాది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ పథకాలు, చట్టాలను మరింత మెరుగ్గా అమలు చేయడం, అంతరాష్ట్ర నదీ జలాల ఫిర్యాదులపై చర్చించారు. మొత్తం 44 అంశాలు ఎజెండాలో చేర్చారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో అమలు చేయాల్సిన అంశాలు, చేపట్టాల్సిన పనులు కూడా ఇందులో ఉన్నాయి.

ఇదీ చూడండి: 'పవార్​పై కేసు... రాజకీయ అవకాశవాదమే'

Last Updated : Oct 2, 2019, 5:09 AM IST

ABOUT THE AUTHOR

...view details