గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ట్రాక్లర్ల ర్యాలీ అనంతరం గల్లంతైన రైతుల ఆచూకీని కనుగొనడంలో దిల్లీ ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ట్రాక్టర్ల ర్యాలీకి సంబంధించి దిల్లీ పోలీసుల అదుపులో ఉన్న రైతుల జాబితాను ఆయన విడుదల చేశారు. ట్రాక్టర్ల ర్యాలీలో జరిగిన ఆందోళనల అనంతరం పలువురు రైతులు కనిపించకుండా పోయినట్లు పలు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి.
గల్లంతైన రైతులను కనుగొనడంలో సహకరిస్తాం: కేజ్రీవాల్ - delhi voilence news
గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన ఘటనలకు సంబంధించి.. 115 మంది దిల్లీ పోలీసుల అదుపులో ఉన్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. ఆ రోజు గల్లంతైన వారి ఆచూకీని కనుగొనడంలో తమ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.
"గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన ఘటనలకు సంబంధించి 115 మంది దిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రస్తుతం వారంతా దిల్లీలోని వివిధ జైళ్లలో ఉన్నారు. గల్లంతైన రైతుల ఆచూకీని కనుగొనేందుకు దిల్లీ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుంది. అవసరమైతే గవర్నర్, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం" అని ఆయన తెలిపారు. విలేకరుల సమావేశానికి ముందు సంయుక్త్ కిసాన్ మోర్చాకు సంబంధించిన న్యాయబృందం కేజ్రవాల్‌ను కలిసి గల్లంతైన రైతులను కనుగొనాలని కోరారు. ఈ మేరకు 29మంది రైతుల జాబితాను వారు ముఖ్యమంత్రికి అందించారు.