ఝార్ఖండ్ హజారీబాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంచీ నుంచి పట్నా వెళుతున్న మహారాణి బస్సు.. చౌపారణ్ సమీపంలోని దనువా లోయ వద్ద ఓ లారీని వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 26 మంది గాయపడ్డారు.
అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను చౌపారణ్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని జిల్లా కేంద్రం హజారీబాగ్‌కు తీసుకెళ్లారు.