తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎద్దును తప్పించబోయి ప్రమాదం.. 12 మంది దుర్మరణం - kuchaman road accident news

రాజస్థాన్​ నాగౌర్ జిల్లాలో మినీ బస్సు.. ఎద్దును తప్పించబోయి అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

రెండు మినీబస్సులు ఢీ

By

Published : Nov 23, 2019, 9:48 AM IST

Updated : Nov 23, 2019, 10:31 AM IST

రాజస్థాన్​ నాగౌర్ జిల్లా కుచామన్​లో ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. నడిరోడ్డుపై ఉన్న వృషభాన్ని తప్పించబోయి మినీ బస్సు అదుపుతప్పింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు.

బాధితులంతా మహారాష్ట్ర లాతూర్​ నుంచి హరియాణలోని హిసార్​కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డుపైకి అకస్మాత్తుగా వచ్చిన ఎద్దును తప్పించేందుకు డ్రైవర్ సడన్​ బ్రేక్​ వేయగా.. మినీ బస్సు నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన 10 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు.


రెండు మినీబస్సులు ఢీ

ఇదీ చూడండి: ఊహించని మలుపు- మహారాష్ట్రలో భాజపా-ఎన్​సీపీ ప్రభుత్వం

Last Updated : Nov 23, 2019, 10:31 AM IST

ABOUT THE AUTHOR

...view details