తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి.. 11 మంది మృతి - Khatlapura

గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి

By

Published : Sep 13, 2019, 7:32 AM IST

Updated : Sep 30, 2019, 10:19 AM IST

08:45 September 13

పెను విషాదం..

మధ్యప్రదేశ్​లో పెను విషాదం

మధ్యప్రదేశ్​ భోపాల్‌ వినాయక నిమజ్జనంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని నదిలో జల ప్రవేశానికి తరలిస్తుండగా పడవ బోల్తా పడి 11 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. నదిలో పడిపోయిన వారిలో ఆరుగుర్ని కాపాడారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

భోపాల్‌ ఖత్లాపుర ఘాట్​లో 2 పడవలను జతచేసి నిమజ్జనం చేసేందుకు విగ్రహాన్ని తరలించారు. విగ్రహంతోపాటు చాలామంది పడవ ఎక్కారు. పరిమితికి మించిన బరువు కారణంగా పడవ బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ఎవరూ లైఫ్‌ జాకెట్లు ధరించలేదన్నారు.

 ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి తలా రూ. 4 లక్షల పరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.

07:22 September 13

గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి.. 11 మంది మృతి

గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి

మధ్యప్రదేశ్​ భోపాల్​లోని ఖత్లాపుర ఘాట్​లో గణేశ్​ నిమజ్జనం చేస్తుండగా విషాదం చోటుచేసుకుంది. పడవ నీటిలో మునిగిపోయిన ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి తలా రూ. 4 లక్షల పరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.

Last Updated : Sep 30, 2019, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details