108 ఏళ్ల నిర్విరామ ఓటరు తెలుసా?` ఓటింగ్ శాతం రోజురోజుకూ తగ్గిపోతుంది. అవగాహన కోసం ఎన్నికల సంఘం ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం అంతంతే. చదువుకున్న వారూ ఓటేయటానికి ముందుకు రావట్లేదు. ఇలాంటి వారందరికీ బిహార్లోని ఒక పెద్దాయన ఆదర్శంగా నిలుస్తున్నారు.
అందరూ ఓటేయాలి. పేదల దుఃఖాన్ని దూరం చేసే వారిని గెలిపించాలి.
- హేమ్రాజ్ పాసవాన్
హేమ్రాజ్ పాసవాన్ వయస్సు 108 ఏళ్లు. బిహార్ గయాలోని ఫతేపూర్ పంచాయతీ వాసి. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. మాటలు తడబడుతున్నాయి. నడవటం కూడా కష్టంతో కూడుకున్న పనే. అయినప్పటికీ ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో ఒటేస్తానని గర్వంగా చెబుతున్నారు.
మా తండ్రి మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఓటేశారు. అప్పటినుంచి విధానసభ, లోక్సభకు జరిగిన ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి కూడా ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ ప్రజలను చైతన్య పరుస్తుంటారు.
- హేమ్రాజ్ కుమారుడు
ఏప్రిల్ 11న బిహార్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది.