తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హోమ్​ ఐసోలేషన్​లోనే కరోనాను ఓడించిన 105 ఏళ్ల బామ్మ - కరోనాను జయించిన బామ్మ

కరోనా సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నా.. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ, హోమ్​ ఐసోలేషన్​లో ఉంటూ కర్ణాటకకు చెందిన 105 ఏళ్ల బామ్మ ఈ మహమ్మారిని జయించింది. అది కూడా వారం రోజుల్లోనే వైరస్​ను ఓడించి ఔరా అనిపించింది.

105-year-Old Woman Beats Corona
కరోనాను ఓడించిన 105 ఏళ్ల బామ్మ

By

Published : Sep 12, 2020, 1:07 PM IST

కరోనా మహమ్మారి సోకి మరణించిన వారిలో వృద్ధులదే అధిక వాటా. అరవై ఏళ్లకు పైబడిన వ్యక్తులే ఎక్కువగా వైరస్​ కాటుకు బలవుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే.. కర్ణాటక కొప్పల ప్రాంతానికి చెందిన 105 ఏళ్ల బామ్మ కరోనాను ఓడించింది.

కర్ణాటక కొప్పల జిల్లా కటారకి గ్రామానికి చెందిన కమలమ్మ లింగనగౌడ హెరేగౌద్ర అనే వృద్ధురాలు తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లింది. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా తేలింది. కానీ, ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరించింది కమలమ్మ. దాంతో ఆమె కొడుకు హోమ్​ ఐసోలేషన్​ ఏర్పాటు చేసి చికిత్స అందించే ఏర్పాట్లు చేశాడు.

కమలమ్మ మనుమడు, డాక్టర్​ శ్రీనివాస హతి ఆమెకు వైద్యం అందించాడు. ప్రతిరోజు ఆమెలో ధైర్యం నింపుతూ మందులు అందించగా.. వారం రోజుల్లోనే వైరస్​ నుంచి కోలుకుంది. కరోనా పరీక్షల్లో నెగిటివ్​గా తేలింది.

ఇదీ చూడండి: 105 ఏళ్ల వయసులో కరోనాను జయించిన బామ్మ

ABOUT THE AUTHOR

...view details