తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో 'కరోనా' మరణ మృదంగం - corona toll news

కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 15 రాష్ట్రాల్లో 194 మంది మరణించగా.. అందులో 54 శాతంతో ఒక్క మహారాష్ట్రలోనే 105 మంది ప్రాణాలు కోల్పోవటం ఆందోళనకర విషయం. మొత్తం రోగల్లో చనిపోయిన వారి శాతం 2.86కు చేరింది.

corona
మహారాష్ట్రలో 'కరోనా' మరణ మృదంగం

By

Published : May 29, 2020, 6:14 AM IST

Updated : May 29, 2020, 6:20 AM IST

దేశంలో కరోనా మరణ మృదంగం మోగించింది. కేవలం 24 గంటల వ్యవధిలో 15 రాష్ట్రాల్లో 194 మంది మృత్యువు బారిన పడ్డారు. ఒక్క మహారాష్ట్రలోనే 105 మంది (54%) కన్నుమూశారు. ఈ నెల 5న ఇదే రీతిలో దేశంలో 194 మంది చనిపోయారు. మొత్తం రోగుల్లో చనిపోయిన వారి శాతం 2.86కి, కోలుకున్నవారి శాతం 44.60కి చేరింది. మహారాష్ట్రలో గత 24 గంటల్లోనే 130 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. పోలీసు బలగాల్లో పాజిటివ్‌గా వచ్చినవారి సంఖ్య 2095కి చేరుకుంది. వీరిలో 1859 మంది కానిస్టేబుళ్లు. వేర్వేరు ఆసుపత్రుల్లో వీరంతా చికిత్స పొందుతున్నారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు కనీసం 22 మంది పోలీసు సిబ్బంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. బిహార్‌ కేసుల సంఖ్య 3,000 దాటింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇదివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో 24 గంటల్లో ఏకంగా 443 కొత్త కేసులు నమోదయ్యాయి. వలస కార్మికుల రాకతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తమిళనాడు, దిల్లీల్లో ఉద్ధృతి తగ్గడం లేదు. మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, జమ్మూ-కశ్మీర్‌, అసోంలలోనూ భారీగా కొత్త కేసులొచ్చాయి.

కేరళలో మారిన పరిస్థితి

కేరళలో మళ్లీ కేసుల పెరుగుదల కనిపిస్తోంది. వారం రోజుల్లో అక్కడ 300 కొత్త కేసులొచ్చాయి. కేసుల నియంత్రణలో ఆ రాష్ట్రం ఒక దశలో విజయం సాధించింది. వందే భారత్‌ విమానాల ద్వారా విదేశాల నుంచి వలసలు ప్రారంభమయ్యాక అక్కడ కేసులు పెరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో 14 రోజులకు కేసులు రెట్టింపు అవుతుండగా, కేరళలో మాత్రం 12 రోజులకే ఆ పరిస్థితి వస్తోంది. ప్రస్తుత పోకడ ప్రకారం చూస్తే కేసుల పరంగా నాలుగో స్థానానికి కేరళ చేరుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు ఒకే స్థాయిలో కేసులున్న దిల్లీ కంటే గుజరాత్‌లో మరణాలు మూడు రెట్లు అధికం.

దిల్లీలోని ఎయిమ్స్‌లో ఇంతవరకు కరోనా పాజిటివ్‌గా తేలిన ఆరోగ్య సిబ్బంది సంఖ్య 195కి చేరింది. గత రెండువారాల్లోనే ముగ్గురు రెసిడెంట్‌ డాక్టర్లు, ఒక ఎంబీబీఎస్‌ విద్యార్థి, ఎనిమిది మంది నర్సులు సహా యాభై మంది కరోనా బారిన పడ్డారు.

రాష్ట్రాల్లో కరోనా కేసులు
గురువారం ఒక్క రోజు నమోదైన కేసులు, మరణాలు
Last Updated : May 29, 2020, 6:20 AM IST

ABOUT THE AUTHOR

...view details