మహారాష్ట్ర, కర్ణాటకలో ఇవాళ కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించింది. మహారాష్ట్రలో ఒక్కరోజు కేసులు మళ్లీ 10 వేల మార్కు దాటింది. బుధవారం 10 వేల 309 మందికి కరోనా సోకింది. మరో 334 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 4 లక్షల 68 వేలు దాటాయి. లక్షా 45 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3 లక్షల మందికిపైగా కోలుకున్నారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 16 వేల 476 మంది మరణించారు.
మహారాష్ట్రలో ఒక్కరోజే 334 కరోనా మరణాలు - government
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో మంగళవారం.. కొవిడ్ కేసులు కాస్త తక్కువ నమోదుకాగా మళ్లీ ఇవాళ పెరిగాయి. ఒక్కరోజే 10 వేల 309 మంది వైరస్ బారినపడ్డారు. మరో 334 మంది మరణించారు. కర్ణాటకలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలో ఒక్కరోజే 334 కరోనా మరణాలు
కర్ణాటకలో మరో 5619 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజే 100 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 2804కు చేరింది. రాష్ట్రంలో మొత్తం కేసులు లక్షా 51 వేలు దాటాయి.