భాజపా ఎమ్మెల్యే భీమా మండావి సహా నలుగురు భద్రతా సిబ్బంది హత్యకు గురైన దంతెవాడ ఘటనపై ఛత్తీస్‌గఢ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
దళ కమాండర్లు దేవ్, వినోద్ సహా సుమారు వంద మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. ఘటనా స్థలంలో పేలుడుకు ఉపయోగించిన జీపీఎస్ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పక్కా ప్రణాళికతోనే దాడి
పక్కా ప్రణాళిక ప్రకారమే మావోయిస్టులు ఈ దురాఘతానికి పాల్పడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఒకేసారి 100 మంది పాల్గొనడం ముందస్తు వ్యూహం లేకుండా సాధ్యం కాదన్నారు.
ఎమ్మెల్యే ప్రచారానికి వెళ్లిన మార్గంలో ఘటన జరిగే ఒక్కరోజు ముందే పేలుడు పదార్థాల కోసం తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. అయితే, ఎమ్మెల్యే వచ్చే కొద్ది గంటల క్రితమే మావోయిస్టులు పేలుడు పదార్థాలను అమర్చి ఉంటారని పోలీసులు నిర్ధరించారు. ఘటన జరిగిన స్థలం నుంచి ఎమ్మెల్యే సెల్‌ఫోన్‌ను మావోయిస్టులు తీసుకెళ్లారని అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి:భారత్ భేరి: ఓట్ల పండుగకు వేళాయె...