తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారంలోనే 10 లక్షల మంది కొత్త ఓటర్లు - Kerala

గతవారంలో కొత్తగా 10 లక్షల మందికి ఓటు హక్కు కల్పించామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో 4 లక్షల మంది మొదటిసారి ఓటింగ్​ పొందినట్లు పేర్కొంది​. ఈ సార్వత్రిక ఎన్నికలు మొదటి, రెండో విడతల్లో 2,954 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారంది ఈసీ.

వారంలోనే లక్షలాది మంది కొత్త ఓటర్లు!

By

Published : Apr 5, 2019, 9:29 AM IST

Updated : Apr 5, 2019, 10:00 AM IST

వారంలోనే 10 లక్షల మంది కొత్త ఓటర్లు

సార్వత్రిక ఎన్నికల వేళ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. గత వారంలో దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఓటు కోసం ఎన్నికల సంఘం వద్ద పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 4 లక్షల మంది మొదటిసారి ఓటు పొందినవారని ఈసీ వెల్లడించింది.

"మేము ఓటర్ల జాబితాలో 10 లక్షల మందిని కొత్తగా చేర్చాం. వీరిలో 4 లక్షల మంది మొదటిసారి ఓటు హక్కు పొందినవారు. వీళ్లు 18-19 ఏళ్ల వయస్సువారు. " - సందీప్ సక్సేనా, డిప్యూటీ ఎలక్షన్​ కమిషనర్​

వీరితో పాటు ఓటర్ల జాబితాలో సుమారు 61 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని సక్సేనా స్పష్టం చేశారు.

మొదటి రెండో విడత లోక్​సభ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ఈ రెండు విడతల్లో 2,954 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలుస్తున్నారని ఈసీ తెలిపింది.

ఏప్రిల్​ 11న జరిగే తొలివిడత ఎన్నికల్లో మొత్తం 1,280 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో 1,188 మంది పురుషులు, 92 మంది మహిళలు ఉన్నారు. ఏప్రిల్​ 18న జరిగే రెండో విడత ఎన్నికల్లో 1,674 మంది పురుషులు, 125 మంది మహిళలు తలపడుతున్నారు.

'సీ విజిల్' సూపర్​హిట్

గత సంవత్సరం ఎలక్షన్​ కమిషన్​ అందుబాటులోకి తెచ్చిన 'సీ విజిల్​' మొబైల్ అప్లికేషన్​ మంచి ఆదరణ పొందిందని సక్సేనా తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేయడానికి దీనిని అందుబాటులోకి తెచ్చారు.

ఈ యాప్​ ద్వారా ఇప్పటి వరకు 40,116 ఫిర్యాదులు అందాయని ఆయన అన్నారు. వాటిలో 99 శాతం (39,900) ఫిర్యాదులను పరిష్కరించామని, అందులో 68 శాతం నిజమైన ఫిర్యాదులని సక్సేనా స్పష్టం చేశారు. ఎక్కువగా కేరళ నుంచి ఫిర్యాదులు అందాయని సక్సేనా తెలిపారు.

Last Updated : Apr 5, 2019, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details