లాక్డౌన్ తర్వాత జూన్ 1న తొలిసారి ప్రారంభం కాబోయే ప్యాసింజర్ రైళ్లకు విశేష స్పందన లభిస్తోంది. 100 ప్యాంసింజర్ రైళ్లకు అనుమతించిన రైల్వే .. వీటి బుకింగ్లు ప్రారంభించింది.
అయితే రెండు గంటల్లోనే దాదాపు 1.50 లక్షల టికెట్లు బుకింగ్ అయినట్లు అధికారులు తెలిపారు.
"12 గంటల సమయంలో 73 రైళ్లకు సంబంధించిన బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 2,90,510 మంది ప్యాసింజర్లతో, 1,49,025 టికెట్లు బుకింగ్ అయ్యాయి."
-రైల్వే ప్రతినిధి
అంతకుముందు, 1.7 లక్షల సాధారణ సేవా కేంద్రాల్లో టికెట్ బుకింగ్ సర్వీసులు ప్రారంభమవుతాయని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రానున్న రెండు మూడు రోజుల్లో అనుమతించిన స్టేషన్ కౌంటర్లలో బుకింగ్ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. మరిన్ని రైళ్లు నడిపే అంశంపై త్వరలోనే ప్రకటన జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
అన్ని రైళ్లలో ఏసీ కోచ్లు
బుకింగ్లు ప్రారంభమైన రైళ్లలో ఏసీ, నాన్-ఏసీ తరగతులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి అన్ని ప్రత్యేక రైళ్లలో ఈ తరగతులు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
సాధారణ రైళ్ల మాదిరిగానే ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వేశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రాల రాజధానులు సహా రెండు పెద్ద నగరాలను కలుపుతూ ఇవి ప్రయాణిస్తాయని తెలిపింది.
ఇదీ చదవండి:భారత్లో 5 కోట్ల మందికి కరోనా ముప్పు!