తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొవాగ్జిన్' అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు!

టీకా అత్యవసర ఉపయోగానికి అనుమతులు కోరుతూ భారత్ బయోటెక్ దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. సీరం, ఫైజర్ సంస్థలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి.

Bharat Biotech seeks emergency use authorisation for indigenously developed COVID-19 vaccine Covaxin
'కొవాగ్జిన్' అత్యవసర అనుమతుల కోసం దరఖాస్తు!

By

Published : Dec 7, 2020, 10:32 PM IST

దేశీయంగా అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగం కోసం అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు భారత్ బయోటెక్ దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఇప్పటికే సీరం ఇన్​స్టిట్యూట్, ఫైజర్ ఇదే తరహా దరఖాస్తులు చేసుకోగా.. భారత్​ బయోటెక్​ మూడో సంస్థగా నిలిచింది.

భారత్​ బయోటెక్, సీరం, ఫైజర్ సంస్థల దరఖాస్తులను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్​సీఓ)కు చెందిన నిపుణుల కమిటీ(సబ్జెక్ట్​ ఎక్స్​పర్ట్​ కమిటీ) క్షుణ్ణంగా పరిశీలించనుంది. అనుమతులు మంజూరు చేసే విషయంపై కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.

అయితే ఇప్పటివరకు ఏ సంస్థ దరఖాస్తును కూడా కమిటీకి పంపించలేదని అధికార వర్గాలు తెలిపాయి. వీటిపై చర్చించేందుకు ఎస్​ఈసీ సమావేశ తేదీని సైతం నిర్ణయించలేదని స్పష్టం చేశాయి.

ABOUT THE AUTHOR

...view details