Bhajaranga dal Activist Murder: కర్ణాటక శివమొగ్గలోని సీగెహట్టిలో భజరంగ్‌దళ్ దళ్ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు యువకుల సమూహం ఇతనిపై మారణాయుధాలతో దాడి చేసి క్రూరంగా చంపినట్లు తెలుస్తోంది. మృతుడ్ని 24 ఏళ్ల హర్షగా పోలీసులు గుర్తించారు. అతడు వృత్తిరీత్యా టైలర్ అని, భజరంగ్ కార్యకర్తగా కూడా ఉన్నాడని వెల్లడించారు.
ఆదివారం రాత్రి హర్ష హత్య అనంతరం శివమొగ్గలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు హిందూ సంస్థలు హర్ష మరణించిన ఆస్పత్రి వద్ద నిరసనకు దిగాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. నిరసనల్లో భాగంగా పలువురు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. వాహనాలకు నిప్పంటించి తగులబెట్టారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు.
హింసాత్మక ఘటనల నేపథ్యంలో శివమొగ్గలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు అధికారులు. జిల్లాలో 144 సెక్షన్ విధించారు. 1నుంచి12వ తరగతి వరకు తరగతులను మూసివేశారు.
సీఎం స్పందన..