బంగాల్ ముఖ్యమంత్రి(West Bengal Cm) మమతా బెనర్జీపైభవానీపుర్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో(Bhabanipur By Election) భాజపా అభ్యర్థిగా(Bhabanipur Bjp Candidate పోటీకి దిగుతున్న.. ప్రియాంక తిబ్రివాల్(Priyanka tibrewal) సోమవారం నామినేషన్ వేశారు. కోల్‌కతాలోని సర్వే బిల్డింగ్‌కు బంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారితో(Suvendu Adhikari) కలిసి చేరుకున్న ప్రియాంక.. నామపత్రాల సమర్పణ ప్రక్రియ పూర్తిచేశారు.
బంగాల్ ప్రతిపక్ష నేత సవేందు అధికారి సమక్షంలో నామినేషన్ వేస్తున్న ప్రియాంక నామపత్రాలు సమర్పిస్తున్న ప్రియాంక తిబ్రివాల్ ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీచేసిన బంగాల్ ముఖ్యమంత్రి మమత(West Bengal Cm) అప్పుడు ఓడిపోయారు. అయినా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన దీదీ.. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భవానీపుర్ నుంచి ఎన్నికైన సోబన్దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేయగా.. ఉపఎన్నిక(Bhabanipur By Election) నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం.
ఈ క్రమంలో దీదీపై ఎవరు పోటీకి దిగుతారన్న అంశంపై స్పష్టతనిచ్చిన భాజపా.. న్యాయవాది ప్రియాంక తిబ్రీవాల్‌ను(Priyanka tibrewal) తమ అభ్యర్థిగా ప్రకటించింది.
భవానీపుర్‌లో ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
తిబ్రీవాల్ గురించి ముఖ్యమైన అంశాలు...
- ప్రియాంక తిబ్రీవాల్ 1981, జులై 7న కోల్‌కతలో జన్మించారు. పాఠశాల విద్యను వెల్లాండ్ గౌల్డ్స్మిత్ స్కూల్లో పూర్తి చేశారు. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. 2007, కోల్‌కతా విశ్వవిద్యాలయం పరిధిలోని హజ్రా లా కళాశాల నుంచి న్యాయ విద్య పట్టా అందుకున్నారు. అలాగే థాయిలాండ్‌లోని అసంప్సన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి ఆకర్షితులై, భాజపా నేత బాబుల్ సుప్రియో సూచనలతో 2014లో కాషాయ పార్టీలో చేరారు ప్రియాంక తిబ్రీవాల్. సుప్రియోకు లీగల్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారు.
- 2015లో కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వార్డు నంబర్ 58లో(ఎంటల్లీ) భాజపా టికెట్‌పై పోటీ చేశారు ప్రియాంక. అయితే.. టీఎంసీ అభ్యర్థి స్వపన్ సమ్మద్దర్పై ఓటమిపాలయ్యారు.
- 2020, ఆగస్టులో బంగాల్ భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు ప్రియాంక. ఈ ఆరేళ్ల కాలంలో తనకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశారు.
- ఈఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంటల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ప్రియాంక. అయితే.. టీఎంసీ అభ్యర్థి స్వర్ణ కమల్ సాహాపై 58,257 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఇదీ చూడండి:భవానీపుర్‌లో మమత ఎన్నిక లాంఛనమేనా?