తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Best Freelance Websites In Telugu: ఫ్రీలాన్సర్​గా పనిచేయాలనుకుంటున్నారా?.. టాప్ 10 ఫ్రీలాన్సింగ్​ వెబ్​సైట్స్ ఇవే!

Best Freelance Websites In Telugu : మీరు ఫ్రీలాన్సర్​గా వర్క్ చేద్దామని అనుకుంటున్నారా? ఇంట్లోనే ఉంటూ.. మీకు నచ్చిన పనిచేస్తూ.. చేతినిండా డబ్బులు సంపాదించాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. నేడు ఆన్​లైన్​లో అనేక ఫ్రీలాన్సర్ వెబ్​సైట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని రిలయబుల్​ వెబ్​సైట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Best Freelance Websites
Best Freelance Websites

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 8:46 AM IST

Best Freelance Websites In Telugu : నేటి యువత ఆఫీస్​కు వెళ్లి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జాబ్స్ చేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇంట్లోనే ఉంటూ, తమకు వీలైన సమయంలో, తమకు నచ్చిన పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మరికొందరు ఉన్నత విద్య అభ్యసించి కూడా.. సరైన ఉద్యోగం లభించక ఇబ్బంది పడుతుంటారు. వీరు కూడా తమ స్కిల్​కు సరిపోయే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కోసం చూస్తుంటారు. అందుకే ఇలాంటి వారందరికీ ఉపయోగపడే కొన్ని నమ్మదగిన ఫ్రీలాన్సింగ్ వెబ్​సైట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Best Freelance Websites List :

  1. Fiverr :డిజిటల్ మార్కెటింగ్​, వెబ్​ డెవలప్​మెంట్​, సోషల్​ మీడియా రిలేటెడ్ వర్క్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్​ అని చెప్పవచ్చు. వాస్తవానికి దీనిలో చాలా భిన్నమైన కేటగిరీలు ఉంటాయి. కనుక మంచి కోడింగ్​, డిజైన్ స్కిల్స్ ఉన్నవారికి ఇక్కడ కచ్చితంగా మంచి వర్క్ దొరుకుతుంది. ఈ Fiverr వైబ్​సైట్​లో ఉచితంగా రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. పైగా మీ స్కిల్స్​ను ఇంకా ఇంఫ్రూవ్ చేసుకోవడానికి ఆన్​లైన్ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ Fiverr వైబ్​సైట్​లో మీరు ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశారంటే.. టోటల్ గిగ్​లో 20 శాతం కమిషన్​గా పోగా.. మిగతా 80% మనీ మీ అకౌంట్​లో డిపాజిట్ అయిపోతుంది. ఈ Fiverr వెబ్​సైట్​లో దాదాపు 3.42 మిలియన్ల యాక్టివ్ బయ్యర్లు ఉన్నారు. కనుక మంచి స్కిల్​ ఉండి, పెర్ఫెక్ట్​గా వర్క్ చేసినవారికి మంచి ప్రాజెక్టులు వస్తాయి. దానికి తగ్గ ఆదాయం కూడా లభిస్తుంది.
    Fiverr
  2. Freelancer.com :ఈ ఫ్రీలాన్సర్​.కామ్ వెబ్​సైట్​లో.. కంటెంట్ ట్రాన్స్​లేషన్​, వెబ్​ డెవలప్​మెంట్, సోషల్​ మీడియా మార్కెటింగ్ జాబ్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద కంపెనీలు, ప్రొఫెషనల్స్ ఇందులో ప్రాజెక్టులు చేస్తుంటారు. కనుక ఈ వెబ్​సైట్​కు బెస్ట్ యూజర్ బేస్ ఉంది. మీకు గనుక హయ్యర్ క్వాలిఫికేషన్​, బెస్ట్ స్కిల్స్ ఉంటే.. వీటిలో మీకు మంచి ప్రాజెక్ట్ రావడం గ్యారెంటీ. దీనిలో ఉన్న మంచి విషయం ఏమిటంటే.. వెబ్​సైట్​ వాళ్లు కమిషన్​గా కేవలం 10% మాత్రమే తీసుకుంటారు. మిగతా 90% అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
    Freelancer.com
  3. Upwork :బ్రాండ్​ మార్కెటింగ్​, ప్రోగ్రామింగ్​, వెబ్​సైట్ డిజైనింగ్ లాంటి వర్క్స్ ఇక్కడ లభిస్తాయి. దీనిలో ప్రధానంగా బడ్జెట్ బేస్డ్​ ప్రాజెక్టులు ఉంటాయి. కనుక కొత్తగా ఫ్రీలాన్సింగ్ చేసేవాళ్లకు కూడా ఇందులో ప్రాజెక్ట్స్​ లభించే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో వెబ్​సైట్​ వాళ్లకు 20% వరకు కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది.
    upwork
  4. Guru :మార్కెటింగ్​, ప్రోగ్రామింగ్​, అడ్మినిస్ట్రేషన్​కు చెందిన ప్రాజెక్టులు ఈ Guru వెబ్​సైట్​లో ఉంటాయి. దీనిలో ఫ్రీ మెంబర్​షిప్ ఫెసిలిటీ ఉంది. అలాగే కస్టమైజ్డ్​ జాబ్ లిస్టింగ్స్ కూడా ఉంటాయి. కనుక చాలా సులువుగా మీ కేటగిరీ ప్రాజెక్టులను వెతుక్కోవచ్చు. కానీ దీనిలో చాలా మంది ఫేక్ క్లైంట్స్ కూడా ఉంటారు. కనుక అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
    Guru
  5. Toptal :సాఫ్ట్​వేర్ డెవలప్​మెంట్, ఫైనాన్సియల్​ కన్సల్టింగ్​, ఇంటరిమ్​ మేనేజ్​మెంట్ జాబ్స్ ఇందులో ఉంటాయి. దీనిలో బెస్ట్ కంపెనీలు, టాలెంటెడ్ పీపుల్ ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ వెబ్​సైట్​లో కేవంల బిగ్​ బడ్జెట్​ ప్రాజెక్టులు మాత్రమే చేస్తూ ఉంటారు. అందుకే హైలీ క్వాలిఫైడ్​, సూపర్ స్కిల్డ్ పీపుల్​కు మాత్రమే ఇందులో ప్రాజెక్టులు లభించే అవకాశం ఉంటుంది. పేమెంట్​ కూడా భారీగానే ఉంటుంది.
    Toptal
  6. Jooble :కంటెంట్ రైటింగ్​, గ్రాఫిక్ డిజైన్​, డేటా ఎంట్రీ జాబ్స్ చేయాలని అనుకునేవారికి Joobly బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీనిలో లక్షలాది ప్రాజెక్టులు ఉంటాయి. అయితే వాటిలో మీకు నచ్చిన వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీకు గనుక ప్రాజెక్ట్ ఓకే అయితే.. ఈ-మెయిల్ ద్వారా అలర్ట్ వస్తుంది.
    Jooble
  7. Flexjobs :కంటెంట్​ రైటింగ్​, కంటెంట్ మార్కెటింగ్​, ట్రాన్స్​క్రిప్షన్​ వర్క్​లు ఇందులో లభిస్తాయి. అంతేకాదు ఇందులో స్కామ్​-ఫ్రీ ప్రొటక్షన్ కూడా ఉంటుంది. కానీ ఇందులో పనిచేయాలంటే సబ్​స్క్రిప్షన్ ప్లాన్​ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
    Flexjobs
  8. LinkedIn :కాపీ రైటింగ్, ట్రాన్స్​లేషన్​, గ్రాఫిక్ డిజైన్​ లాంటి ప్రాజెక్టులు ఇందులో ఉంటాయి. అంతేకాదు నెట్​వర్క్ ఆపర్చూనిటీస్​, రీసెంట్ న్యూస్ అప్​డేట్స్​, జాబ్​ అప్​డేట్స్ కూడా ఇందులో ఉంటాయి. అయితే ఈ ప్లాట్​ఫాంలో చాలా వరకు నకిలీ యూజర్లు ఉంటారు. కనుక ప్రాజెక్టులు చేసే ముందు చాలా జాగ్రత్తగా అన్ని విషయాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది.
  9. SimplyHired :హ్యూమన్ రిసోర్స్​, ఫైనాన్స్​, డేటా ఎంట్రీ లాంటి ప్రాజెక్టులు ఇందులో ఉంటాయి. అంతేకాదు.. ఇందులో ఫ్రీ జాబ్​ టూల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
  10. 99designs :వెబ్​ డెవలప్​మెంట్​, లోగో, గ్రాఫిక్ డిజైన్ లాంటి వర్క్స్​ ఇందులో ఉంటాయి. ఇందులో పేమెంట్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే మీరు చేసే ప్రాజెక్టుకు కచ్చితంగా డబ్బులు వస్తాయి. కానీ ఈ ప్లాట్​ఫాం వాళ్లు 5% నుంచి 15% వరకు కమిషన్​ను వసూలు చేస్తారు.

ఇవే కాదు.. ఆన్​లైన్​లో వెతికితే.. ఇంకా చాలా ఫ్రీలాన్సింగ్ వెబ్​సైట్స్ కనిపిస్తాయి. అయితే వీటిలో చాలా వరకు నకిలీ వెబ్​సైట్స్​ కూడా ఉంటాయి. కనుక వీలైనంత వరకు పాపులర్ వెబ్​సైట్​లను ఎంచుకోవడమే మంచిది.

సొంతంగా వెబ్​సైట్​ : మీరు కనుక సొంతంగా వెబ్​సైట్​ క్రియేట్​ చేసుకుంటే.. అందులోనే చాలా సులువుగా ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే, అది సక్సెస్ కావడానికి కాస్త సమయం పట్టవచ్చు. కానీ ఒకసారి అది క్లిక్ అయ్యిందంటే.. ఇకమీరు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.

Salary Negotiation Tips : జీతభత్యాలు గురించి మాట్లాడాలా?.. ఈ టిప్స్​తో బెస్ట్ ప్యాకేజీ గ్యారెంటీ!

How To Success In Interview : ఇంటర్వ్యూకు సిద్ధం అవుతున్నారా?.. ఈ టిప్స్​ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ!

ABOUT THE AUTHOR

...view details