Best Dog GPS Trackers in Telugu :మెజారిటీ జనాలకు కుక్క ఇప్పుడు రెండు రకాలుగా ఉపయోగపడుతోంది. ఒకటి ఇంటికి కాపలా కాస్తుంది. రెండోది స్టేటస్ సింబల్. ఎంత ఖరీదైన బ్రీడ్ ను ఇంటికి తెచ్చుకుంటే వారి స్టేటస్ అంతగా పెరిగిపోయింది అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి! మరి, ఇలాంటి కుక్కు.. ఒక రోజు ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు చూస్తామని చెప్పారు. కానీ.. ఆ కుక్కును చూసే వరకూ మీ మనసు సాధారణ స్థితికి రాలేదు. మరి, ఇప్పుడేం చేయాలి? అన్నప్పుడు మీకు కనిపించే సూపర్ ఆప్షన్ GPS ట్రాకర్. దీని ద్వారా కుక్క ఎక్కడున్నా.. మనం ఈజీగా కనిపెట్టొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో పలు జీపీఎస్ ట్రాకర్లు ఉన్నాయి. అవేంటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
విజిల్ గో ఎక్స్‌ప్లోర్ పెట్ ట్రాకర్(Whistle Go Explore Pet Tracker) : విజిల్ గో ఎక్స్‌ప్లోర్ అనేది సౌకర్యవంతమైన, ఆచరణాత్మక సాధనం. ఇది ఎప్పటికప్పుడు మీ డాగ్ ఎక్కడ ఉందనే విషయాన్ని పక్కాగా చూపిస్తుంది. ఇంకా.. ఆరోగ్యం గురించి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. దీని ధర ప్రస్తుత మార్కెట్లో రూ. 16,741గా ఉంది. ఇది దాదాపు దేశం మొత్తాన్ని కవర్ చేస్తుంది. ఇది కుక్క విశ్రాంతి తీసుకునే విషయాన్ని కూడా తెలుపుతుంది. ఈ పరికరం మూడు ఆకర్షణీయమైన రంగులలో వస్తుంది. మీ కుక్క చీకట్లో కూడా కనిపించేలా లైటింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. ఇందులోని బ్యాటరీ ఛార్జింగ్ మూడు వారాలకు పైగా ఉంటుంది.
ప్లాటినం పెట్ ఫైండర్(Platinum Pets Positively Pet Finder) :దీని ధర రూ. 2,880గా ఉంది. ఇది హైటెక్ ప్రత్యామ్నాయం కానప్పటికీ చాలా చౌకగా లభిస్తూనే.. ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. దీన్ని మీ కుక్క కాలర్(Dog Collar)కు జోడిస్తే సరిపోతుంది. డాగ్ తప్పిపోయినట్లయితే.. దాన్ని కనుగొనడానికి అవసరమైన మొత్తం సమాచారాన్ని కలిగి ఉంటుంది. ప్రతీ ట్యాగ్ వ్యాపార వెబ్‌సైట్‌లో నమోదు చేయగల కోడ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ప్రతిదీ సెట్ చేయాలి. దానిద్వారా అది తప్పిపోతే మీకు వెబ్సైట్ వారు సమాచారం అందిస్తారు.
పెంపుడు జంతువులకూ ఆన్లైన్లోనే రైలు టికెట్లు.. మెడికల్ సర్టిఫికెట్ కంపల్సరీ!
ట్రాక్టివ్ LTE GPS డాగ్ ట్రాకర్(Tractive LTE GPS Dog Tracker) : ఈ పెట్ ట్రాకర్ పైన పేర్కొన్న వాటి మాదిరిగానే అనేక సామర్థ్యాలను కలిగి ఉంది. దీని ధర మార్కెట్లో 9,005 రూపాయలుగా ఉంది. ఇది ప్రతి 2-3 సెకన్లకు మీ కుక్క స్థానాన్ని అప్‌డేట్ చేస్తుంది. అవి ఉండకూడని చోటకు ఎప్పుడైనా వెళ్లాయా అనేది దీని ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. ఈ పరికరం కాలర్‌కు గట్టిగా జోడించబడి ఉంటుంది. దాంతో కాలర్ బిగించినంత కాలం మీ కుక్క ఎక్కడ ఉందో ఆ విషయం మీకు తెలుస్తుంది. దీని బ్యాటరీని క్రమం తప్పకుండా రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.
Sanyipace GPS ట్రాకర్(Sanyipace GPS Tracker) :దీనిని నాలుగో ఉత్తమ ట్రాకర్‌గా చెప్పుకోవచ్చు. దీని ధర రూ. 3,059గా ఉంది. ఇది మీ పెంపుడు జంతువులకు భారంగా ఉండకుండా చాలా తేలికగా, చిన్నదిగా ఉంటుంది. మీ ఫోన్‌లో మీ పెంపుడు జంతువు లోకేషన్ ఎప్పటికప్పుడు వీక్షించవచ్చు. దీని ద్వారా మీ డాగ్ వేరే ప్రదేశంలోకి వెళ్తే అలారం ధ్వనిస్తుంది. ఇందులో కాల్ ఫీచర్ కోసం కాల్ బ్యాక్ నంబర్ సెట్ చేయబడింది. మీరు సరే బటన్‌ను నొక్కితే, పెట్ ట్రాకర్ మీ తరఫున పేర్కొన్న నంబర్‌కు కాల్ చేస్తుంది.