3 గంటల వరకు 70 శాతం పోలింగ్
బంగాల్ ఆరో దశ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 70.42 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నాలుగు జిల్లాల పరిధిలోని 43 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది.
17:31 April 22
3 గంటల వరకు 70 శాతం పోలింగ్
బంగాల్ ఆరో దశ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 70.42 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నాలుగు జిల్లాల పరిధిలోని 43 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది.
14:15 April 22
57శాతం పోలింగ్..
కరోనా వేళ.. బంగాల్లో ఆరోదశ పోలింగ్ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకు 57.30 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
11:49 April 22
37 శాతం ఓటింగ్..
బంగాల్ ఎన్నికల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ.. తమ అమూల్యమైన ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకుంటున్నారు. ఉదయం 11:30 గంటల వరకు 37.27 శాతం ఓటింగ్ జరిగింది.
11:09 April 22
డ్రోన్ల సాయంతో పర్యవేక్షణ
రాష్ట్రంలో ఆరోదశ ఎన్నికల పోలింగ్‌ను డ్రోన్ల సాయంతో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని 131,132 పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని డ్రోన్ కెమెరాతో పరిశీలిస్తున్నారు.
10:01 April 22
భద్రతా బలగాల గస్తీ..
బంగాల్లో ఆరో విడత పోలింగ్ కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంతంగా సాగుతోంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. కట్వా, పూర్వ వర్ధమాన్ జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు.
09:36 April 22
17 శాతం పోలింగ్..
బంగాల్లో ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 9:30 గంటల వరకు 17.19 శాతం ఓటింగ్ నమోదైంది.
08:40 April 22
ప్రతిఒక్కరూ ఓటు వేయాలి: మోదీ
బంగాల్ ఆరో దశ ఓటర్లను పోలింగ్‌కు తరలిరావాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. "బంగాల్లో ఆరోదశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా."
07:41 April 22
ఓటు వేసిన భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు
భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లా కాంచరాపాడాలోని 141వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
07:21 April 22
ఓటు వేసిన రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు
రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు అర్జున్ సింగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని జగత్దల్లోని 144వ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. భాట్పాడా నియోజకవర్గంలోని భాజపా అభ్యర్థిగా నిలిచిన ఆయన కుమారుడు.. పవన్ సింగ్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
06:31 April 22
లైవ్: పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
బంగాల్లో ఆరో విడత పోలింగ్ ప్రారంభమైంది. జగత్దల్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌ల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
43 నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 303 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరోనా ఉద్ధృతి మధ్య నాలుగు జిల్లాల్లోని 14,480 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరుగుతుంది.
పటిష్ఠ భద్రత నడుమ పోలింగ్
నాలుగు, ఐదో దశ ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. పోలింగ్ జరగనున్న 43 నియోజకవర్గాల్లో 1071 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు వివరించారు. కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.