తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తొమ్మిదో తరగతి విద్యార్థికి అర గంటలో 2 టీకాలు! - అరగంట వ్యవధిలో బాలుడికి రెండు టీకాలు

two shots in single day: ఓ విద్యార్థి అరగంట వ్యావధిలో రెండు డోసులను తీసుకున్నాడు. మొదట టీకా తీసుకున్న ఆ కుర్రాడు పాఠశాల ప్రాంగణంలో తిరుగుతుండడం చూసి వ్యాక్సిన్​ అంటే భయపడుతున్నాడు అని ధైర్యం చెప్పి మరోసారి టీకా ఇచ్చారు వైద్య సిబ్బంది. ఈ ఘటన బంగాల్​లోని ఖరగ్​పుర్​లో జరిగింది.

vaccine
అర గంటలో 2టీకాలు వేయించుకున్న విద్యార్థి!

By

Published : Jan 19, 2022, 1:51 PM IST

two shots in single day: తొమ్మిదో తరగతికి చెందిన విద్యార్థి అర గంట వ్యవధిలో రెండు కొవిడ్‌ టీకాలు వేయించుకున్న ఘటన బంగాల్‌లోని ఖరగ్‌పుర్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని దేబ్రా ప్రాంతంలో జరిగింది.

దేబ్రాలోని అలోకా పాఠశాలలో చదువుతున్న సాథీదే అనే విద్యార్థి సోమవారం మొదటి టీకా వేయించుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లకుండా పాఠశాల గేటు వద్ద తిరుగుతూ కనిపించాడు. వ్యాక్సిన్‌ వేసుకోవడానికి భయపడుతున్నాడని భావించిన పాఠశాల సిబ్బంది ధైర్యం చెప్పి, లోపలకు తీసుకెళ్లారు. టీకా వేయడం పూర్తయ్యాక తాను మొదటి టీకా కూడా వేయించుకున్నట్లు మెల్లగా చెప్పగా ఖంగుతిన్నారు.

ఇలా ఎందుకు చేశావని వారు ప్రశ్నించగా... ఒకేరోజు రెండు టీకాలు వేస్తారని అనుకున్నానని అమాయకంగా బదులిచ్చాడు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో లీనమైన తాము కూడా గుర్తించలేకపోయామని ఆందోళన చెందిన వైద్యులు, ఉపాధ్యాయులు అప్రమత్తమయ్యారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 24 గంటలు పర్యవేక్షణలో ఉంచి పరిశీలించారు. విద్యార్థి ఆరోగ్యం సాధారణంగా ఉందని నిర్ధరించుకున్నాక ఇంటికి పంపించారు.

ABOUT THE AUTHOR

...view details