Benefits Of Lighting Lamps At Tulsi Tree : కార్తికానికి సమమైన మాసం, శ్రీ మహావిష్ణువుతో సమానమైన దైవం, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవని స్కంద పురాణం చెబుతోంది. కార్తిక మాసంలో చేసే పూజలతో పాపాలు తొలిగిపోతాయని భక్తులు నమ్ముతారు. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసి చెట్టు వద్ద నిత్య దీపారాధన చేస్తారు. తులసి అంటే లక్ష్మీ రూపమని.. తులసి వద్ద దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లేనని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే, తులసి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం వల్ల పలు శుభఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. మరి ఆ శుభ ఫలితాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
Tulasi Importance: హిందూ సంప్రదాయంలో తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో తులసికి ఎంతో భక్తితో పూజలు చేస్తారు. మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానమాచరించి తమ సౌభాగ్యం పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు. తులసిని బృందా అని కూడా అంటారు. పురాణాల్లో తులసి మొక్కను కొలిచేందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. స్వర్గం లేద వైకుంఠం చేరేందుకు తులసి వారథిగా ఉంటుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలు, పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తారు. తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తు దోషాలు ఉన్న తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. తులసి ఆకుల రసం ఆయుర్వేదం, ఇంటి వైద్యం చిట్కాలలో విస్తృతంగా వాడుతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు. మరి ఇంతటి విశిష్టత కలిగిన తులసి మొక్క వద్ద కార్తికంలో దీపం వెలిగిస్తే కలిగే శుభఫలితాలు ఇవే..