పంజాబ్‌లో కూలీ పనులు చేయించడానికి బిహార్ నుంచి తీసుకెళ్తున్న 52 మంది చిన్నారులను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కాపాడారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. మొరాదాబాద్‌లో 12 మందిని.. మరో కేసులో 40 మంది చిన్నారులను రక్షించారు. అయితే ఈ పిల్లలంతా 12 నుంచి 15ఏళ్ల లోపు వారేనని అధికారులు తెలిపారు.
పిల్లలను ప్రశ్నించగా.. వారు భయంతో నోరు మెదపలేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే నిందితులను విచారించగా.. బాధిత పిల్లలంతా బిహార్‌లోని పుర్ణియా జిల్లాకు చెందినవారుగా తెలిసిందని.. వారిని పంజాబ్‌లో కూలీ పనులు చేయడానికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. అయితే మానవ అక్రమ రవాణా జరుగుతుందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.