తమిళనాడులోని చారిత్రక పంబన్ వంతెనకు తృటిలో ప్రమాదం తప్పింది. రామేశ్వరంలో ఉన్న ఈ బ్రిడ్జిని ఓ బార్జ్ (పెద్ద నౌక) ఢీ కొడుతూ వెళ్లింది. శనివారం మధ్యాహ్నం దక్షిణం నుంచి ఉత్తరం వైపు మరో రెండు టగ్ బోట్లతో కలిసి వెళ్తున్న ఈ నౌక.. గాలి వీచే దిశలో ఆకస్మిక మార్పుల వల్ల వంతెనను తాకుతూ వెళ్లింది.
అయితే ఈ ఘటనలో వంతెనకు ఎలాంటి నష్టం జరగలేదని ఓ అధికారి తెలిపారు. బ్రిడ్జి దాటిన తర్వాత మరో కంట్రీ బోటును కూడా ఢీకొట్టింది ఈ బార్జ్. దీంతో స్థానిక మత్స్యకారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 2013లోనూ ఓ నేవీ బార్జ్.. వంతెనను తాకుతూ వెళ్లడం వల్ల నిర్మాణానికి భారీగా నష్టం జరగడమే అందుకు కారణం.