తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్యాంక్ ఏర్పాటు చేసిన విద్యార్థులు.. మేనేజర్​, క్యాషియర్ స్టూడెంట్సే​.. పొదుపే మంత్రంగా..

School Students Bank : చిన్న వయసు నుంచే పొదుపు చేయటం నేర్పిస్తున్నారు ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. పొదుపు గురించి చెప్పటమే కాదు విద్యార్థులతో డబ్బులను ఆదా చేయిస్తున్నారు. సేవింగ్స్ అంటే మళ్లీ బ్యాంకుకు వెళ్లాలి అని అనుకుంటారేమో... అంత అవసరం లేకుండానే పాఠశాలలోనే విద్యార్థులతో ఒక బ్యాంకును ఏర్పాటు చేయించారు. ఆ బ్యాంకుకు విద్యార్థులే మేనేజర్​, క్యాషియర్​, డిపాజిట్​దారులు. గుజరాత్​లో ఉన్న ఈ ప్రత్యేకమైన బ్యాంకు గురించి ఓ సారి తెలుసుకుందాం.

School Students Bank
School Students Bank

By

Published : Jul 23, 2023, 7:13 AM IST

Updated : Jul 23, 2023, 8:49 AM IST

బ్యాంకును ఏర్పాటు చేసిన విద్యార్థులు.. మేనేజర్​, క్యాషియర్ స్కూడెంట్సే

School Students Bank : డబ్బులు డిపాజిట్ చేయాలంటే బ్యాంకుకు వెళ్లాలి. విద్యార్థులు అయితే ఒకరోజు సెలవు తీసుకొని మరి బ్యాంకుకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి అవసరం మాకు లేదనంటున్నారు గుజరాత్​లోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. పాఠశాలలోనే ఒక బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలలోనే ఒకరు బ్యాంకు మేనేజర్​, మరొకరు క్యాషియర్​గా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులే ఆ బ్యాంకు డిపాజిట్​దారులు. వారికి నచ్చినంత డబ్బును ఆ బ్యాంకులో ఆదా చేసుకోవచ్చు. కావల్సినప్పుడు డబ్బులను విత్​డ్రా చేసుకోవచ్చు.

భవిష్యత్తు అవసరాలకు వాటిని..
ఖేడా జిల్లాలోని కాజీపురా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పాఠాలతో పాటు డబ్బులను పొదుపు ఎలా చేయాలో నేర్పిస్తున్నారు అక్కడి ఉపాధ్యాయులు. చిన్న వయసు నుంచే పొదుపుగా డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో... భవిష్యత్తు అవసరాలకు వాటిని ఎలా వినియోగించాలో చెబుతున్నారు. డబ్బులను ఆదా చేయమని సూచనలు ఇవ్వడమే కాదు.. వారితోనే స్వయంగా డబ్బులను పొదుపు చేయిస్తున్నారు. అందుకోసం పాఠశాలలోనే 'బ్యాంకు ఆఫ్ కాజీపురా' పేరుతో ఒక బ్యాంకును ఏర్పాటు చేశారు. ఆ బ్యాంకులో పిల్లలు డబ్బులను జమ చేస్తారు. కావలసినప్పుడు విత్​డ్రా చేసుకుంటారు. ఈ బ్యాంకును ఒకటి నుంచి ఎనిమిదివ తరగతి వరకు ఉన్న విద్యార్థులే నడిపిస్తున్నారు.

విద్యార్థుల బ్యాంక్​

"మా నాన్న ప్రతిరోజు నాకు డబ్బులు ఇస్తారు. దానిలో కొంత నేను వాడుకుంటున్నాను. మిగిలిన డబ్బులను బ్యాంకులో జమ చేస్తాను. ఆ డబ్బులు నాకు కావలసిన వాటిని కొనుక్కొవడానికి, ఏదైనా అవసరాలకు వాడుతాను."

- ప్రియా ఠాకుర్, విద్యార్థిని

ఎంతో మంది విద్యార్థులు..
"ఇంతకుముందు విద్యార్థులు తమ ఇంటి నుంచి తెచ్చిన డబ్బునంతా ఖర్చు చేసేవారు. మేము మా పాఠశాలలో 'కాజీపురా బ్యాంక్' ప్రారంభించినప్పటి నుంచి విద్యార్థులందరూ డబ్బును ఆదా చేస్తున్నారు. వారు తమకు అవసరమైన వాటి కోసమే ఖర్చు చేస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తారు" అని మరో విద్యార్థి తెలిపాడు.

చిన్నవయసులో అలా అలవాటు చేసేందుకే..
పాఠశాలలో బ్యాంకు ఏర్పాటు చేయటానికి కారణం.. పిల్లలకు చిన్న వయసులో పొదుపు చేయడం అలవాటు చేయడానికేనని ఉపాధ్యాయులు అంటున్నారు. అప్పుడే వారికి డబ్బులను ఎలా ఖర్చు చేయాలి.. ఎంత ఖర్చు చేయాలనేది తెలుస్తుందని చెబుతున్నారు.

"విద్యార్థులకు ఈ కాజీపురా బ్యాంకులో ఎలా డబ్బులను జమ చేయాలో అర్థమయ్యేలా తెలుపుతున్నాం. పుస్తకాలు, యూనిఫాం కోసం ఇంట్లో వారిని డబ్బులు అడగకుండా వారే బ్యాంకులో ఆదా చేసిన సొమ్మును తీసుకుంటారు. విద్యార్థులకు కావలసినప్పుడు డబ్బును విత్​డ్రా చేసుకోవచ్చు."

- మంజుల, టీచర్​

బ్యాంకు ఏర్పాటుకు అదే ప్రధాన కారణం..
"పిల్లలు జంక్ పుడ్ తింటే అది సరిగా జీర్ణం అవ్వదు. వారు పౌష్ఠికాహరం తినాలి. డబ్బును పొదుపు చేయాలి. ఇదే బ్యాంకు ఏర్పాటు చేయటానికి ప్రధాన కారణం. చిన్న వయసు నుంచే డబ్బు విలువను విద్యార్థులకు తెలియజేయాలి" అని ప్రిన్సిపల్​ సునీల్​ తెలిపారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులకు డబ్బును పొదుపు చేయటం నేర్పించాలనే ఉద్దేశంతోనే బ్యాంకును ఏర్పాటు చేశామని ఉపాధ్యాయులు అంటున్నారు. వారి ఖర్చులకు అవసరమైన డబ్బుల కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా విద్యార్థులే పొదుపు చేసుకోవాలనేదే తమ ఉద్దేశమని చెబుతున్నారు.

Last Updated : Jul 23, 2023, 8:49 AM IST

ABOUT THE AUTHOR

...view details