తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కావేరీ నీటి వివాదం.. బంద్​లో పాల్గొన్న రైతుల అరెస్ట్!.. నోట్లో చనిపోయిన ఎలుకలు పెట్టుకొని.. - బెంగళూరు బంద్ సెప్టెంబర్ 26

Bangalore Bandh News : కావేరీ నదీజలాల విడుదలను వ్యతిరేకిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులో అన్నదాతలు ఆందోళన చేపట్టారు. పలు ప్రాంతాల్లో బస్సులు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు, తమిళనాడులో నీటి విడుదలకు మద్దతుగా అన్నదాతలు నిరసన చేశారు.

Bangalore Bandh News
Bangalore Bandh News

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 1:43 PM IST

కావేరీ నీటి వివాదం.. బంద్​లో పాల్గొన్న రైతుల అరెస్ట్! నోట్లో చనిపోయిన ఎలుకలు పెట్టుకొని..

Bangalore Bandh News :కావేరీ నదీజలాల విడుదలకు వ్యతిరేకంగా కర్ణాటకలో రైతు సంఘాలు పిలుపునిచ్చిన బంద్ కొనసాగుతోంది. తమిళనాడు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు నిర్వహించారు. కొన్నిచోట్ల రైతు సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, బంద్ ప్రభావం ఆ రాష్ట్రంలో పాక్షికంగానే కనిపించింది. ప్రభుత్వ సేవలన్నీ యథాతథంగా కొనసాగుతున్నప్పటికీ.. ప్రజలు ఎక్కువగా బయట తిరగడం లేదు. ప్రయాణికులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

బంద్ వాతావరణం

Karnataka Cauvery Bandh :రైతు సంఘాలను సమన్వయం చేసే 'కర్ణాటక జల సంరక్షణ సమితి' బంద్​కు పిలుపునిచ్చింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగనుంది. బంద్​కు బీజేపీ, జేడీఎస్ మద్దతు ఇచ్చాయి. బంద్ నేపథ్యంలో ర్యాలీగా వస్తున్న.. రైతు నాయకుడు కురుబూరు శాంతకుమార్, ఇతర నాయకులను పోలీసులు మైసూరు బ్యాంక్ సర్కిల్ వద్ద నిర్బంధించారు. టౌన్ హాల్ సమీపంలో మరికొంత మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం తమ నిరసనను అణచివేయడం సరికాదని రైతు నాయకులు మండిపడుతున్నారు.

పోలీసుల బందోబస్తు

Karnataka Cauvery Water Issue :నిరసనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగర పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బందోబస్తు కోసం 100 బృందాలను రంగంలోకి దించారు. నగరవ్యాప్తంగా 144 సెక్షన్ విధించినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ బీ దయానంద వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని చెప్పారు.

బంద్ వాతావరణం

బంద్ ప్రభావం ప్రజల ప్రయాణాలపై పడింది. తమిళనాడు సరిహద్దుల్లోని ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు నిలిచిపోయాయి. ఆ రాష్ట్రం నుంచి కర్ణాటకలోకి ప్రవేశించే బస్సులను నిరసనకారులు అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్​పోర్ట్ కార్పొరేషన్ బస్సులు యథావిధిగా నడిచినప్పటికీ.. రద్దీ పెద్దగా కనిపించలేదు. నగరంలోని ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాయి.

నోట్లో ఎలుకలు కరచుకొని...
మరోవైపు, నీటి విడుదలకు మద్దతుగా తమిళనాడులో నిరసనలు జరిగాయి. తిరుచిరాపల్లిలో కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలు నిరసన చేపట్టారు. కావేరీ జలాలు వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఎలుకలను నోట కరచుకొని ఆందోళన నిర్వహించారు.

Bangalore Bandh : బెంగళూరులో ప్రైవేట్​ వాహనాలు బంద్​.. సామాన్యుల ఇక్కట్లు.. బస్సులో ఇంటికి​ కుంబ్లే..

Karnataka Gruha Lakshmi Scheme : 'ఎన్​డీఏ సర్కార్​ బిలియనీర్ల కోసమే.. మేము పేదల పక్షం'

ABOUT THE AUTHOR

...view details