Bandipora Grenade attack: జమ్ము కశ్మీర్ బందిపొరాలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయారు. మరో పోలీసు, ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు.
నిషత్ పార్క్ సమీపంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు ఓ చోట ఉన్నాయని, ఆ సమయంలో ఉగ్రవాదులే గ్రెనేడ్ దాడి చేశారని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. జమ్ము కశ్మీర్ పోలీసు శాఖలో డ్రైవర్గా పనిచేసే జుబేర్ అహ్మద్ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు.