తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సంక్రాంతికి అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన.. అప్పుడే దర్శనం - అయోధ్య రామ మందిరం లేటెస్ట్​ అప్డేట్స్​

అయోధ్యలోని రామమందిర నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు సగం పనులు పూర్తి కాగా.. 2024 జనవరికల్లా రామమందిరాన్ని భక్తుల సందర్శనార్థం ప్రారంభిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.

ayodhya ram mandir opening date
ayodhya ram mandir

By

Published : Oct 26, 2022, 7:41 AM IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన భవ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించి 2024 జనవరిలో కోవెలను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆలయ నిర్మాణం యావత్తూ సంతృప్తికరంగా సాగుతున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర మంగళవారం తెలిపింది.

"మకర సంక్రాంతి పర్వదిన సమయంలో గర్భగుడిలో రామ్‌ లల్లా విగ్రహాలను ప్రతిష్ఠించి, భక్తుల సందర్శనార్థం జనవరి 2024లో రామమందిరాన్ని ప్రారంభిస్తాం" అని దేవాలయ నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ వెల్లడించారు. కోవెల భూ అంతస్తు(గ్రౌండ్‌ ఫ్లోర్‌) వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతుందన్నారు. జనవరి 14న రాముడి విగ్రహాల ప్రతిష్ఠాపన జరుగుతుందని తెలిపారు. రామాలయ నిర్మాణానికి సుమారు రూ.1800 కోట్లు ఖర్చవుతాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details