తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భద్రతా వలయంలోకి అయోధ్య- 10వేల మంది పోలీసులతో గస్తీ - ayodhya ram mandir pran pratishtha

Ayodhya Ram Mandir Security : రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గరపడిన వేళ అయోధ్య కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించేందుకు అయోధ్యలో కేంద్ర బలగాలతో పాటు భారీగా ఉత్తర్‌ప్రదేశ్‌ భద్రతా బలగాలు మోహరించాయి. రామ సేవక్ పురంతో పాటు చాలా ప్రాంతాలు ATS కమాండోల నిఘా పరిధిలోకి వెళ్లాయి.

Ayodhya Ram Mandir Security
Ayodhya Ram Mandir Security

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 4:10 PM IST

Ayodhya Ram Mandir Security : అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరు కానున్న ఈ కార్యక్రమం సవ్యంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయోధ్యలో ఇప్పటికే వెయ్యికి పైగా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. రామ మందిరానికి అన్నివైపులా డ్రోన్లతో జల్లెడ పడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ATS, STF, PCS, UPSFతో పాటు ఇతర విభాగాల పోలీసులను యూపీ ప్రభుత్వం రామ మందిరం వద్ద మోహరించింది. కేంద్ర బలగాలను కూడా పెద్ద ఎత్తున అయోధ్యలో మోహరించారు.

అయోధ్యలో ఏటీఎస్​ బలగాల గస్తీ

యాంటీ డ్రోన్​ టెక్నాలజీ ఏర్పాటు
రామ మందిరం ప్రాంతంలో యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలు భద్రతా పరమైన రిహార్సల్స్ ప్రారంభించాయి. రామ మందిరం ప్రారంభోత్సవానికి 7 వేల 500 మందికి పైగా ప్రముఖులు రానుండటం వల్ల వారి భద్రత కోసం కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా బార్‌ కోడింగ్ విధానాన్ని అనుసరించనున్నారు. మరోవైపు అయోధ్యలోని స్థానికులు కూడా భద్రతాపరమైన అంశంలో సాయం చేస్తున్నారని అధికారులు తెలిపారు. సాంకేతికతను వినియోగించి ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు.

10వేల సీసీ కెమెరాలతో భద్రత
అయోధ్య రామమందిరంపై, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​పై బాంబు దాడి చేస్తామంటూ బెదిరింపుల నేపథ్యంలో భద్రతను మరింత పెంచారు. అక్రమ చొరబాట్లు జరిగే యూపీ-నేపాల్​ సరిహద్దులో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. ఏఐ టెక్నాలజీ, హ్యూమన్​ ఇంటెలిజెన్స్​తో కూడిన 10వేల సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులను గుర్తించేలా 4.5 కిలోమీటర్ల పరిధిలో డోమ్​ను ఏర్పాటు చేశారు. డ్రోన్లతో పాటు సుమారు 10వేల మంది పోలీసు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. 100 డీఎస్​పీలు, 325 మంది ఇన్​స్పెక్టర్లు, 800 మంది ఎస్​ఐలు విధులు నిర్వర్తించనున్నారు.

గర్భగుడిలోకి రాముడి విగ్రహం
జనవరి 22న ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో మంగళవారం నుంచే క్రతువులు ప్రారంభమయ్యాయి. పూజలందుకునే బాల రాముడి విగ్రహాన్ని గురువారం గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఏడు రోజుల పాటు సాగే ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో భాగంగా గురువారం కలశ పూజ నిర్వహించారు.

ఉద్యోగులకు గుడ్​న్యూస్​- అయోధ్య గుడి ప్రాణప్రతిష్ఠ రోజున హాఫ్​ డే లీవ్

గర్భగుడిలో అయోధ్య రాముడి విగ్రహం- వేద మంత్రాల మధ్య జలాభిషేకం!

ABOUT THE AUTHOR

...view details