Awareness on Acohol on The Eve of New Year: దేశమంతటా న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. బాణసంచా కాల్చుతూ విద్యుత్ వెలుగుల్లో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే.. ఇది ఒక వైపు మాత్రమే.. కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం ఏరులై పారుతోంది. ఆల్కహాల్ సేవించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఫలితంగా ఎన్నో ప్రమాదాలు జరిగి అనేక కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.
awareness on alcoholism: ఇలాంటి పరిస్థితిలో మద్యం సేవించకుండా అవగాహన కల్పించడానికి మహరాష్ట్ర పుణెకు చెందిన ఓ వ్యక్తి.. సరికొత్త అవతారం ఎత్తాడు. రావణుడి వేషం వేసుకుని మద్యానికి బదులు పాలు సేవించాలని ప్రచారం చేశాడు. ఓ చేత్తో కత్తి, మరో చేతిలో పాల ప్యాకెట్లను పట్టుకుని రహదారులపై సంచరించాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పాల ప్యాకెట్లను పంచిపెట్టాడు. 'పాలు ముద్దు .. ఆల్కహాల్ వద్దు' అనే నినాదంతో ప్రజలకు మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు. మద్యం అలవాటును వీడాలని పిలుపునిచ్చాడు.
"నేను రాక్షసుని వేషం వేశాను. మీలోని రాక్షసున్ని తొలగించండి. ఆల్కహాల్ అలవాటును మానేయండి. పాలు తాగండి ఆరోగ్యంగా ఉంటారు. చిన్నతనంలో అమ్మ నుంచి పాలుతాగితేనే పెద్దవాళ్లమయ్యాము."
- అరుణ్ వోహార్