దేశంలో రెండో దశ కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ అంబులెన్స్‌ల కొరత రోగుల పాలిట శాపంగా మారింది. ఇది చూసి చలించిపోయిన మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ యువకుడు తన ఆటోనే అంబులెన్స్‌గా మార్చాడు. ఈ ఆటో ఎక్కే రోగుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్ కూడా ఏర్పాటు చేశాడు. ఇందుకు తన భార్య దాచుకున్న డబ్బులు ఖర్చుపెట్టాడు. ఐతే, జావేద్ ఇదంతా డబ్బులు ఆశించి చేయలేదు. నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తనవంతుగా ఏదైనా సాయం చేయాలని అనుకున్నాడు. కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగులకు ఉచితంగా అత్యవసర సేవలు అందించి ఆసుపత్రులకు తరలించేందుకే ఈ అంబులెన్స్ సిద్ధం చేసినట్లు జావెద్ చెబుతున్నాడు.
"అంబులెన్స్‌లు లేక కొంత మంది ఇబ్బంది పడుతున్నారని సామాజిక మాధ్యమాలు, న్యూస్ ఛానెళ్లలో చూశాను. వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ ఆటో అంబులెన్స్ రూపొందించాను. నా భార్య లాకెట్ అమ్మి వచ్చిన నగదుతో ఈ అటో అంబులెన్స్ ఏర్పాటు చేశాను. ఆక్సిజన్ సిలిండర్ తీసుకున్నాను."
-జావేద్ ఖాన్, ఆటో అంబులెన్స్ రూపకర్త