Banner for second wife: మహారాష్ట్ర, ఔరంగాబాద్‌లో ఓ వ్యక్తి హాట్‌టాపిక్‌గా మారాడు. తనకు రెండో భార్య కావాలంటూ నగరం మొత్తం బ్యానర్లు ఏర్పాటు చేయటమే అందుకు కారణం. కాబోయే భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయాన్నీ వాటిలో పేర్కొన్నాడు.
అసలు కథ ఇది..
ఔరంగాబాద్ మున్సిపల్ ఎన్నికలు కొద్ది రోజుల్లో రానున్నాయి. రమేశ్ పాటిల్ అనే వ్యక్తి పోటీ చేయాలనుకున్నాడు. కానీ, అతనికి ముగ్గురు పిల్లలు ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయాడు. ఎలాగైనా బరిలో నిలవాల్సిందేనని పట్టుదలతో ఉన్న రమేశ్.. ఓ ఉపాయం చేశాడు. తాను నిలబడలేకపోయినా.. తన కుటుంబంలో నుంచి ఒకరిని పోటీలో నిలపాలనుకున్నాడు. అయితే, సోదరుడు, సోదరి, తల్లిదండ్రులను కాదండోయ్.. రెండో పెళ్లి చేసుకుని వచ్చే భార్యను ఎన్నికల్లో పోటీ చేయించాలని సంకల్పించుకున్నాడు.