తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉగ్ర సంస్థలతో లింకులు'.. బుల్డోజర్​తో మదర్సా కూల్చివేత

Assam Madrassa Demolished : అసోంలో ఉగ్రవాద సంస్థలతో సంబంధముందని మరో మదర్సాను కూల్చివేశారు అధికారులు. బొంగాయ్​గావ్​ జిల్లాలో కబైతరి మా అరిఫ్​ అనే మదర్సాను నేలమట్టం చేశారు. జిహాదీ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని మదర్సాను కూల్చివేసినట్లు అధికారులు చెప్పారు. మరోవైపు ఉత్తర్​ప్రదేశ్​ సమాజ్​వాదీ పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న దుకాణాలను కూల్చివేశారు లఖ్​నవూ మున్సిపల్​ అధికారులు.

Assam Madrassa Demolished
Assam Madrassa Demolished

By

Published : Aug 31, 2022, 6:09 PM IST

Assam Madrassa Demolished : ఇటీవలే బంగ్లాదేశీ జిహాదీ సంస్థలతో సంబంధం ఉన్న మదర్సా నిర్మాణాలను తొలగించిన అసోం ప్రభుత్వం.. తాజాగా మరో మదర్సాను కూల్చివేసింది. అల్​ ఖైదా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో బొంగాయ్​గావ్​ జిల్లాలో కబైతరి మా అరిఫ్​ అనే మదర్సాను నేలమట్టం చేశారు. జిహాదీ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని మదర్సాను కూల్చివేసినట్లు అధికారులు చెప్పారు.

అల్​ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నాయనే ఆరోపణలతో గతవారమే మదర్సా ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. మదర్సాలో ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మనుషులు నివసించేందుకు వీలు లేకుండా.. నిబంధనలను ఉల్లంఘించి మదర్సాను నిర్మించడం వల్లే కూల్చివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మదర్సాలోని పిల్లలను వారి ఇళ్లకు సురక్షితంగా తరలించామని తెలిపారు.

అంతకుముందు బంగ్లాదేశ్‌ ఉగ్రవాద సంస్థ అన్సరుల్‌ ఇస్లాంతో సంబంధాలున్న కేసులో అరెస్టైన ముఫ్తీ ముస్తాఫాకు చెందిన మదర్సాను కూల్చివేశారు. అతడితో పాటు మరో నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు బర్పెట పోలీసులు. ఈ మదర్సా కేంద్రంగా ముఫ్తీ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు అభియోగాలు మోపారు. మదర్సా కూల్చివేత తర్వాత అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ విలేకర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అసోం జిహాదీ కార్యకలాపాలకు స్థావరంగా మారిందని వ్యాఖ్యానించారు. గత అయిదు నెలల్లో అన్సరుల్‌తో సంబంధమున్న అయిదు స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు జిహాదీ కార్యక్రమాలతో సంబంధం ఉన్న 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సమాజ్​వాదీ పార్టీ ఎదురుగా ఉన్న దుకాణాల కూల్చివేత: ఉత్తర్​ప్రదేశ్​ సమాజ్​వాదీ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదురుగా ఉన్న దుకాణాలను కూల్చివేశారు అధికారులు. లఖ్​నవూలోని విక్రమాదిత్య మార్గ్​లో అక్రమంగా నిర్మించినందునే దుకాణాలను కూల్చివేసినట్లు మున్సిపల్​ అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ గత ఆరు నెలలుగా అనేక సార్లు నోటీసులు జారీ చేశామని చెప్పారు. మున్సిపల్​ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని.. రోడ్డుకు ఒకవైపున ఉన్న నిర్మాణాలనే తొలగించారని యజమానులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:సోనియా గాంధీ కుటుంబంలో తీవ్ర విషాదం

'మా వర్గం అమ్మాయితో మాట్లాడతావా?'.. యువకుడ్ని చితకబాదిన క్లాస్​మేట్స్​

ABOUT THE AUTHOR

...view details