తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మానసిక రోగిని కొట్టి చంపిన గ్రామస్థులు.. పిల్లాడిని హత్య చేశాడనే కోపంతో.. - హత్య

Assam lynching case: మతిస్థిమితం సరిగా లేని వ్యక్తిని గ్రామస్థులు తీవ్రంగా కొట్టి చంపి, కాల్చేసిన సంఘటన అసోం దిబ్రుగఢ్​ జిల్లాలో శనివారం జరిగింది. ఓ నాలుగేళ్ల చిన్నారిని హత్య చేశాడనే ఆగ్రహంతో ఇలా చేశారని స్థానికులు తెలిపారు.

Mob lynching
మూక దాడి

By

Published : Mar 13, 2022, 1:08 PM IST

Assam lynching case: ఓ నాలుగేళ్ల పిల్లాడిని హత్య చేశాడనే ఆగ్రహంతో మతిస్థిమితం సరిగా లేని వ్యక్తిపై మూకదాడి చేశారు గ్రామస్థులు. తీవ్రంగా కొట్టి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని కాల్చేశారు. ఈ ఘటన అసోం దిబ్రుగఢ్​ జిల్లా, రామారియా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ధలజన్​​ టీ ఎస్టేట్​లో శనివారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ జరిగింది..

సోనిత్​ తంతి(35) అనే వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదు. ఊర్లో తిరుగుతూ ఉండేవాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి ఉజ్వల్​ మోరాను తీవ్రంగా కొట్టి.. గొంతు కోసి హత్య చేశాడు. ఈ విషయం అందరికీ తెలిసిన క్రమంలో ఆగ్రహానికి గురైన కొందరు స్థానికులు సోనిత్​ను పట్టుకుని తీవ్రంగా కొట్టారు. దీంతో అతను చనిపోయాడు. ఆ తర్వాత అతని మతదేహాన్ని అదే ప్రాంతంలో కాల్చేశారు.

ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న రామారియా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. 302 సెక్షన్​ ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రెండు మృతదేహాలను పోస్ట్​మార్టానికి తరలించారు.

ఇదీ చూడండి:బస్సులో మహిళపై అత్యాచారం.. పక్కా స్కెచ్​తో!

ABOUT THE AUTHOR

...view details