తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాజీ సీఎం మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం - himanta biswa sarma

Assam former CM Tarun Gogoi passes away
అసోం మాజీ సీఎం గొగొయి కన్నుమూత

By

Published : Nov 23, 2020, 5:59 PM IST

Updated : Nov 23, 2020, 7:43 PM IST

18:56 November 23

అసోం మాజీ సీఎం కన్నుమూత- ప్రముఖులు దిగ్భ్రాంతి..

అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తరుణ్‌ గొగొయి (84) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గువాహటిలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. గత నెలలో కరోనా బారిన పడిన ఆయన.. ఈ మహమ్మారి నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో శరీరంలోని అవయవాల పనితీరు క్షీణించడంతో వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తరుణ్‌ గొగొయి మూడు పర్యాయాలు అసోం సీఎంగా, ఆరు సార్లు ఎంపీగా సేవలందించారు.

ప్రముఖుల సంతాపం..

గొగొయి మరణం పట్ల రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, అసోం ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. 

  • తరుణ్​ గొగొయి మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ఆయన మరణం.. ఓ శకం ముగింపును సూచిస్తుందని ట్వీట్​ చేశారు. గొగొయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
  • కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో అనేక సంవత్సరాల అనుభవమున్న నేతను కోల్పోవడం తనను కలచివేసిందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. గొగొయి కుటుంబసభ్యులు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
  • తరుణ్​ గొగొయి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​. రాష్ట్రానికి గొగొయి చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు. రాష్ట్రం ఓ గొప్ప నేతను కోల్పోయిందని.. ఆయన రాజకీయాల్లో ప్రత్యేక వ్యక్తిగా నిలిచిపోతారని ట్వీట్​ చేశారు.

18:44 November 23

ఆయన మరణంతో ముగిసిన శకం..

తరుణ్​ గొగొయి మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ఆయన మరణం.. ఓ శకం ముగింపును సూచిస్తుందని ట్వీట్​ చేశారు. గొగొయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

18:40 November 23

అసోం సీఎం దిగ్భ్రాంతి..

తరుణ్​ గొగొయి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​. రాష్ట్రానికి గొగొయి చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు. రాష్ట్రం ఓ గొప్ప నేతను కోల్పోయిందని.. ఆయన రాజకీయాల్లో ప్రత్యేక వ్యక్తిగా నిలిచిపోతారని ట్వీట్​ చేశారు. 

18:18 November 23

మోదీ సంతాపం

తరుణ్​ గొగొయి మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో అనేక సంవత్సరాల అనుభవమున్న నేతను కోల్పోవడం తనను కలచివేసిందని చెప్పారు. గొగొయి కుటుంబసభ్యులు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

17:54 November 23

అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్​ గొగొయి కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ... గువాహటి ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.  

తరుణ్​ గొగొయి(84) ఆగస్టు 25న కరోనా బారినపడ్డారు. వైరస్​ నుంచి కోలుకున్న అనంతరం.. అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న గువాహటి మెడికల్​ కాలేజ్​ ఆసుపత్రిలో చేరారు. అయితే.. గత శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. మూత్రపిండాల పనితీరు మెరుగయ్యేందుకు సుమారు 6 గంటలపాటు డయాలసిస్​ చేసినా.. ఆరోగ్య స్థితిలో మాత్రం ఏ మార్పులు కనిపించలేదు. చివరకు ఈ సాయంత్రం కన్నుమూసినట్లు అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.

Last Updated : Nov 23, 2020, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details