దేశాన్ని ఓవైపు కరోనా పీడిస్తుంటే.. మరోవైపు బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్‌లు కూడా విరుచుకుపడుతున్నాయి. ఈ సమయంలో మరో కొత్త రకం ఫంగస్ బయటపడింది. ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కళాశాలలో చేరిన ఓ రోగికి ఆస్పర్గిలస్ ఫంగస్ సోకిందని వైద్యులు తెలిపారు.
మే 28న రోగి ఆస్పత్రిలో చేరారు. ముక్కులో ఫంగల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. రోగి నమూనాలను పరీక్షించగా ఆస్పర్గిలస్ ఫంగస్ అని తేలింది. ఈ వ్యాధి చికిత్స బ్లాక్ ఫంగస్ మాదిరి కాదని ఈఎన్టీ నిపుణుడు డాక్టర్ ప్రతాప్ సింగ్ తెలిపారు.
"ఆస్పర్గిలస్ ఫంగస్ వ్యాధి లక్షణాలు భిన్నంగా ఉండకపోయినా.. బ్లాక్ ఫంగస్‌తో పోలిస్తే చికిత్స విధానాలు మాత్రం వేర్వేరు. ఆస్పర్గిలస్ ఇన్ఫెక్షన్కు వోరికొనజోల్ ఔషధాన్ని ఉపయోగిస్తారు. ఈ వ్యాధి సోకిన రోగికి ముందుగా ముక్కుకు ఆపరేషన్ చేశాం. ఈ సందర్భంగా చాలా అవయవాలు దెబ్బతిన్నాయని గుర్తించాం. ముక్కు లోపలి భాగం నల్లగా మారిపోయింది. అనంతరం ఆస్పర్గిలస్ చికిత్స ప్రారంభించాం."