కశ్మీర్లో హిమపాతం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై భారీగా మంచు పేరుకుపోయి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ఇటీవల ప్రసవమైన ఓ మహిళ, ఆమె బిడ్డను.. జవాన్లు స్ట్రెచర్‌పై మోస్తూ కాలినడక ప్రయాణంతో క్షేమంగా ఇంటికి చేర్చారు. సోపోర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
తల్లీబిడ్డలను మోస్తూ మంచులో 3.5కి.మీ నడక
భారత సైన్యం మరోసారి మానవత్వం చాటుకుంది. కశ్మీర్లో ఓ బాలింతను స్ట్రెచర్‌పై 3.5 కి.మీ మోస్తూ ఇంటికి చేర్చారు జవాన్లు.
తల్లీబిడ్డలను స్ట్రెచర్‌పై మోసి.. ఇంటికి చేర్చిన జవాన్లు
తల్లీబిడ్డలను మోసుకుంటూ పజల్‌పొరా నుంచి దునివార్కు సుమారు 3.5 కిలోమీటర్లు నడిచాయి భద్రతా బలగాలు. మంచులో కూరుకుపోయిన రహదారిపై సైనికులు నడుస్తుండగా.. స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది వారికి సహకారమందించారు.
ఇదీ చదవండి:కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి