తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాబోయే సైనికులు.. ఫుట్​పాత్​లే పాన్పులు - ఆర్మీ రిక్రూట్​మెంట్ ర్యాలీ

ఆర్మీ నియామక ర్యాలీలో పాల్గొంటున్న అభ్యర్థులకు కనీస వసతులు కరవయ్యాయి. కర్ణాటకలోని ఉడుపిలో జరుగుతున్న ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన అభ్యర్థులు రోడ్ల వెంట ఫుట్​పాత్​పై నిద్రించడం కనిపించింది. సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Army aspirants sleeping on road at Udupi: What DC says about this?
కాబోయే సైనికులు.. పుట్​పాత్​లే పాన్పులు

By

Published : Mar 20, 2021, 1:05 PM IST

దేశానికి రక్షణగా నిలవబోయే సైనికులు వారు. కానీ ఆర్మీ నియామక ప్రక్రియలో వారికి కనీస సౌకర్యాలు కరవయ్యాయి. కర్ణాటకలోని ఉడుపిలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్​మెంట్ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన అభ్యర్థులు రోడ్లపై నిద్రిస్తున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. దీనిపై స్పందించిన స్థానికులు జిల్లా పరిపాలన యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఉడుపిలో రోడ్లపై నిద్రించిన అభ్యర్థులు

ఉడుపిలోని అజ్జార్కడు మైదానంలో ర్యాలీలో పాల్గొనడానికి రాష్ట్ర నలుమూలల నుంచి 3వేలకు పైగా యువత వస్తున్నారు. ప్రతి రోజూ ఈ ప్రక్రియ ఉదయం 4గంటలకే ప్రారంభమవుతుండటం వల్ల ఒకరోజు ముందుగానే గ్రౌండ్​కు చేరుకుంటున్నారు. దీంతో రాత్రిళ్లు రోడ్లు, పార్కుల్లోనే ఆశ్రయం పొందాల్సివస్తోంది. మార్చి 29 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

అయితే ఆశావహులకు తగిన సౌకర్యాలు కల్పించామని ఉడుపి డిప్యూటీ కమిషనర్ జగదీష తెలిపారు. మిగిలిన జిల్లాల్లా కాకుండా వారికి భోజనం, వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 4గంటలకే ర్యాలీలో పాల్గొనాల్సి ఉన్నందున వారే కావాలని రోడ్లపై నిద్రిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:శతాబ్ది ఎక్స్​ప్రెస్​లో మంటలు- తప్పిన ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details