తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలా?' - మహారాష్ట్ర తాజా రాజకీయ వార్తలు

మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు రావాలని ప్రణాళికలు వేస్తున్నారా? అని కాంగ్రెస్​ను శినసేన ప్రశ్నించింది. 2024 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఒంటరిగా పోటీ చేస్తుందన్న ఆ పార్టీ నేత నానా పటోలే వ్యాఖ్యలపై శివసేన ఈమేరకు స్పందించింది.

sena
శినసేన, కాంగ్రెస్

By

Published : Jun 17, 2021, 4:51 PM IST

2024 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఒంటరిగా పోటీ చేస్తుందన్న ఆ పార్టీ నేత నానా పటోలే వ్యాఖ్యలపై శినసేన ఘాటుగా స్పందించింది. "2019లో ఏం జరిగిందో తెలుసు.. అయినా 2024 ఎన్నికలకు ఎంతో సమయం ఉన్నా.. మధ్యంతర ఎన్నికలు రావాలని ప్రణాళికలు వేస్తున్నారా?" అని ప్రస్తుతం మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్​ను సామ్నా పత్రిక సంపాదకీయంలో ప్రశ్నించింది.

ఆగలేకపోతున్నారా?

2024 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా నానా పటోలే అప్పటివరకు ఆగలేకపోతున్నారని ఎద్దేవా చేసింది శివసేన. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్​ భాగస్వామి అయినప్పటికీ.. ఆ పార్టీది చివరి(మూడో) స్థానమని చురకలంటించింది.

పటోలే మాట్లాడిన కొద్దిసేపటికే.. భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీనేత రావుసాహెబ్​ దాన్వే ప్రకటించడంపైనా సామ్నా సంపాదకీయంలో స్పందించింది శివసేన. "ప్రధాన రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. అయితే మహారాష్ట్ర ప్రయోజనాలకోసం.. శినసేన, ఎన్​సీపీ కలిసి పోటీ చేస్తాయి" అని స్పష్టం చేసింది. భాజపాతో రాష్ట్రంలో ఏ పార్టీ పొత్తు పెట్టుకోదని జోస్యం చెప్పింది.

తప్పేమీ కాదే..

అధికారం కోసం కూటములు కట్టడం, ఒకరి పంచన చేరడం తప్పేమీ కాదని శినసేన వ్యాఖ్యానించింది. అయితే అధికారంలోకి రావడానికి సరిపడా ఎమ్మెల్యేల బలం ఉండాలని పేర్కొంది. "రాష్ట్రం రోజుకో సంక్షోభాన్ని చూస్తోంది. ప్రభుత్వం ఆర్థికంగా, రాజకీయంగా బలహీనంగా ఉందని కొన్ని దుష్ట శక్తులు చూపే ప్రయత్నం చేస్తున్నాయి" అని మండిపడింది.

ఇదీ చదవండి:మోదీపై శివసేన స్వరం మారిందా?

ABOUT THE AUTHOR

...view details